Adi Reddy: ఆదిరెడ్డి మామూలోడు కాదుగా.. హీరోకే షాక్ ఇచ్చాడుగా!

  • December 5, 2022 / 11:33 AM IST

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో విజేతగా ఎవరు నిలుస్తారనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇకపోతే ఏదైనా సినిమా విడుదలవుతున్న లేదా విడుదలైన సినిమా ప్రేమోషన్ కార్యక్రమాల కోసం ఇలా బుల్లితెర కార్యక్రమాలలో సెలబ్రిటీలు సందడి చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే హిట్ 2సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో అడివి శేష్ బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేసినట్టు తాజాగా

విడుదలైన ప్రోమో ద్వారా తెలుస్తుంది.ఈ క్రమంలోనే నాగార్జున కంటెస్టెంట్లతో మాట్లాడుతూ కోడి పుర్రె అని మిర్రర్ పై రాసి పైన కపాలం బొమ్మను వేయమని చెప్పారు. ఇలా వేసిన అనంతరం హీరోని వేదికపైకి పిలిచి అది ఎవరు వేశారో కనుక్కోమని చెప్పారు. ఇక వేదిక పైకి వచ్చిన శేష్ ఇది ఎవరు వేశారు అనేది కనుక్కోవడం కోసం చిన్న లాజిక్ ఉపయోగించారు. ఈ క్రమంలోనే అందరిని లేచి నిలబడమని చెప్పాడు. వారి హైట్ అనుగుణంగా బొమ్మ వేసింది ఎవరో తెలుసుకుంటారని చెప్పారు.

బొమ్మ హైట్ లో లేదు కనుక పొట్టిగా ఉన్న వాళ్ళే గీసి ఉంటారని గెస్ చేసి చెప్పగా హైట్ ఉన్నవాళ్లు బెండ్ అయ్యి కూడా వేసి ఉండొచ్చు కదా అంటూ రోహిత్ లాజిక్ చెప్పాడు. రోహిత్ ఇలా చెప్పడంతో ఆది రెడ్డి నువ్వే వేశావు కదా? అని ప్రశ్నించారు. ఈ విధంగా హీరో శేష్ ఆదిరెడ్డిని అడగడంతో అది చెప్పాల్సింది మీరు సర్ అంటూ నాగార్జున ముందే హీరో అడివి శేష్ కి చిన్న షాక్ ఇచ్చారు.

ఇది విన్న తర్వాత నాగార్జున కూడా కరెక్టే ఆది అంటూ ఆదిని సమర్థించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో వైరల్ కావడంతో ఆదిరెడ్డి మామూలోడు కాదు ఏకంగా హీరోకే కౌంటర్ ఇచ్చారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus