Adipurush: ‘ఆదిపురుష్‌’ కొత్త ట్వీట్‌… మళ్లీ ట్రోల్స్‌ మొదలు!

‘ఆదిపురుష్‌’ సినిమా టీమ్‌ ఏం చేసినా.. సోషల్‌ మీడియాలో బ్యాక్‌ఫైర్‌ అవుతోంది. సినిమా టీజర్‌ విడుదల చేసేంతవరకు అంతా బాగుంది. ఎప్పుడైతే సినిమా టీజర్‌ వచ్చిందో అక్కడి నుండి సినిమా టీమ్‌కి ట్రోలింగ్‌, నెగిటివ్‌ కామెంట్లు ఎక్కువయ్యాయి. తాజాగా సినిమా టీమ్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అలాగే ఆ పోస్ట్‌ మీద కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ సినిమా ఓ విషయంలో నెంబర్ వన్‌లో ఉందట. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేసింది.

ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్’ వరల్డ్ వైడ్ సినిమా దగ్గర హవా చూపిస్తోందని తెలిపింది. గత 30 రోజులుగా వరల్డ్ వైడ్ సినిమాలో అత్యధికంగా వెతికిన సినిమా ‘ఆదిపురుష్’ నంబర్‌ వన్‌లో నిలిచిందని తెలిపారు. దీని బట్టి ‘ఆదిపురుష్’ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని చెప్పుకొచ్చింది. అయితే దీనిని నెటిజన్లు వేరే విధంగా తీసుకుంటున్నారు. సినిమాకు ఉన్న నెగిటివిటీ సరిపోవడం లేదా.. ఇంకా ఇలాంటి పోస్టులు పెట్టి ఇంకా ట్రోలింగ్‌ ఎందుకు పెంచుకుంటున్నారు అని అడుగుతున్నారు.

‘ఆదిపురుష్‌’ సినిమా స్టార్ట్‌ చేసినప్పుడే మోషన్‌ క్యాప్చర్‌ విధానంలో తెరకెక్కిస్తున్నామని చెప్పారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా షూటింగ్‌ జరిగినన్ని రోజులు మళ్లీ ఆ విషయం చెప్పలేదు. దీంతో అసలు విషయాన్ని మరచిపోయి.. ‘ఆదిపురుష్‌’ రియల్‌ మూవీ అనుకుని ఇంకేదో ఎక్స్ట్‌పెక్ట్ చేశారు. తీరా టీజర్‌ దగ్గరకు వచ్చేసరికి బొమ్మలు చూసి చివుక్కుమన్నారు. ఇదేంటి ప్రభాస్‌ని ఇలా చూపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోలింగ్‌ ఎంత కంట్రోల్‌ చేసినా కంట్రోల్‌ అవ్వడం లేదు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. టీజర్‌ ఎఫెక్ట్‌తో సినిమాలో కొన్ని మార్పులు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే మోషన్‌ క్యాప్చర్‌లో ఇప్పటికే పూర్తి చేసుకున్న సినిమాను ఇంకేం మార్చలేరు అని అంటున్నారు. కాబట్టి ఇలాంటి సినిమానే వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేస్తారు. అప్పుడే ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus