Prabhas: ‘ఫౌజీ’.. ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న హాను!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్‌లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో ‘ఫౌజీ’ ఒకటి. ‘సీతారామం’తో మ్యాజిక్ చేసిన హను రాఘవపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఆడియన్స్‌లో అంచనాలు నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి త్వరలోనే ఒక బిగ్ అప్‌డేట్ రాబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ముఖ్యంగా వచ్చే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ ఒక పవర్‌ఫుల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Prabhas

ఈ సినిమాలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపిస్తుండటంతో, దేశభక్తి నిండిన రిపబ్లిక్ డే రోజున ఒక గ్లింప్స్ లేదా స్పెషల్ టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ అప్‌డేట్ ద్వారా ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇవ్వడమే కాకుండా, సినిమా రిలీజ్ డేట్ పై కూడా అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆగస్టు 15న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్న తరుణంలో, ఈ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా కథా నేపథ్యం గురించి వినిపిస్తున్న లీక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేశారట. అయితే ఇందులో అసలైన ట్విస్ట్ ఏమిటంటే, రెండో భాగం సీక్వెల్ కాదు, అది ‘ప్రీక్వెల్’గా రాబోతోంది. అంటే అసలు కథకు ముందు ఏం జరిగిందో రెండో పార్ట్‌లో చూపిస్తారన్నమాట. ఇలాంటి డిఫరెంట్ అప్రోచ్‌తో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించబోతున్నాడు.

నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, అనుపమ్ ఖేర్ మిథున్ చక్రవర్తి వంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ మూవీ కనెక్ట్ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇక రిపబ్లిక్ డే రోజున ప్రభాస్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus