Adipurush Twitter Review: ‘ఆదిపురుష్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ . ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈరోజు అనగా జూన్ 16 న హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది.

హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన కొంత మంది ప్రేక్షకులు ట్విట్టర్ దారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం ‘ఆదిపురుష్’ ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చిందట. అందరికీ తెలిసిన రామాయణమే అయినప్పటికీ సన్నివేశాలు అన్నీ కొత్తగా డిజైన్ చేసాడట దర్శకుడు. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే అందరినీ కట్టిపడేస్తుంది అని వినికిడి.

ఇక సెకండ్ హాఫ్ లో శ్రీరాముని గొప్పతనం, రౌద్రం చూపించిన తీరు అద్భుతమని అంతా అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అయితే ముందు నుండి అనుకున్నట్టుగా ఆశించిన స్థాయిలో లేవట. జై శ్రీరామ్ , సీతా రామ్, వంటి పాటలు డైలోగ్స్.. అనేవి సినిమాకి హైలెట్ అని.. మొత్తంగా సినిమాని ఒకసారి చూడొచ్చని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిసాక ఇక్కడి టాక్ ఎలా ఉంటుందో చూడాలి..!