ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలి అంటే టైటిల్ చాలా కీలకం. మంచి టైటిల్.. అందులోనూ అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ పెడితేనే దానికి పబ్లిసిటీ అవుతుంది. లేదు అంటే జనాలు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అయితే కొన్ని సినిమాలకి ఊహించని విధంగా టైటిల్స్ మార్చి రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ టాలీవుడ్(Tollywood) సినిమాలు ఏంటో? మారిన టైటిల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి:
1)’హే భగవాన్’ టు ‘హే బలవంత్’ : సుశాంత్ హీరోగా శివానీ నాగారం హీరోయిన్ గా గోపి అత్చర దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘హే భగవాన్’. ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది ఈ సినిమా. అయితే ఊహించని విధంగా ఈ సినిమా టైటిల్ కి సెన్సార్ అభ్యంతరాలు తెలిపింది. దీంతో ‘హే బలవంత్’ గా మార్చారు.
2) ‘వానర’ టు ‘వనవీర’ : అవినాష్ తిరువీదుల, సిమ్రాన్, నందు ప్రధాన పాత్రల్లో అవినాష్ తిరువీదుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిన్న సినిమాకి ముందుగా ‘వానర’ అనే టైటిల్ ని పెట్టారు. కానీ రిలీజ్ టైమ్..కి సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు తెలుపడంతో ‘వనవీర’ గా మార్చల్సి వచ్చింది.
3)’చాయ్ వాలా’ టు ‘నవాబ్ కేఫ్’ : శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రమోద్ హర్ష దర్శకుడు. మొదట ఈ సినిమాకి ‘చాయ్ వాలా’ అనే టైటిల్ పెట్టారు. కానీ అందులో ఎటువంటి ఇబ్బంది ఉందో తెలీదు. రిలీజ్ టైమ్..కి ‘నవాబ్ కేఫ్’ గా మార్చేశారు
4)’శ్రీ చిదంబరం’ టు ‘శ్రీ చిదంబరం గారు’ : రెండు వారాల క్రితం రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ‘క’ నిర్మాతలు నిర్మించారు. మొదట ఈ సినిమా టైటిల్ ‘చిదంబరం’ కానీ రిలీజ్ టైమ్..కి ‘శ్రీ చిదంబరం గారు’ గా మారిపోయింది.
5)’వాల్మీకి’ టు ‘గద్దలకొండ గణేశ్’ : వరుణ్ తేజ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఇది. మొదట ఈ సినిమాకి ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టారు. కానీ అది కాంట్రోవర్సీ అవ్వడంతో ‘గద్ధలకొండ గణేష్’ గా మార్చారు.
6)’కొమరం పులి’ టు ‘పులి’: పవన్ కళ్యాణ్ – ఎస్ జె సూర్య కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఇది. మొదట దీనికి ‘కొమరం పులి’ అనే టైటిల్ పెట్టారు. కానీ రిలీజ్ తర్వాత కాంట్రోవర్సీ అవ్వడంతో ‘పులి’ గా మారింది.
7)’నరుడి బ్రతుకు నటన’ టు ‘డిజె టిల్లు’ : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి మొదట ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ పెట్టారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ‘డిజె టిల్లు’ గా మార్చారు.
8)’ముద్ర’ టు : నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. మొదట ‘ముద్ర’ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. తర్వాత మరో సినిమాని ఈ టైటిల్ తో రిలీజ్ చేయడంతో ‘అర్జున్ సురవరం’ గా మార్చారు.
9)’కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ : రాంగోపాల్ వర్మ సినిమాలకి టిటిల్స్ మారడం అనేది కొత్త విషయం కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తీసిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ ని తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ గా మార్చాల్సి వచ్చింది.
10) ‘ఖలేజా’ టు ‘మహేష్ ఖలేజా’ : మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో రూపొందిన ‘ఖలేజా’ సినిమా టైటిల్ ని రిలీజ్ టైమ్లో ‘మహేష్ ఖలేజా’ గా మార్చాల్సి వచ్చింది.
11)’కత్తి’ టు ‘కళ్యాణ్ రామ్ కత్తి’ : కళ్యాణ్ రామ్ హీరోగా మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మొదట ‘కత్తి’ టైటిల్ పెట్టారు. కానీ అదే టైటిల్ ని గుణశేఖర్- రవితేజ సినిమాకి రెజిస్టర్ చేయించడంతో వివాదం అయ్యింది. దీంతో ‘కళ్యాణ్ రామ్ కత్తి’ గా టైటిల్ మార్చారు.
12)’సత్యం శివం సుందరం’ టు ‘మారో’ : సల్మాన్ ఖాన్ తో ‘బాడిగార్డ్’ వంటి ఇండస్ట్రి హిట్ తీసిన సిద్దిక్.. ముందుగా తెలుగులో నితిన్ తో సత్యం శివం సుందరం అనే సినిమా తీశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అటు తర్వాత ‘బాడిగార్డ్’ హిట్ అవ్వడంతో ‘మారో’ గా టైటిల్ మార్చి రిలీజ్ చేశారు.
13)’మిస్టర్ నోకియా’ టు ‘మిస్టర్ నూకయ్య’ : మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి మొదట ‘మిస్టర్ నోకియా’ అనే టైటిల్ పెట్టారు. అయితే ‘నోకియా’ మొబైల్ కంపెనీ వారు అభ్యంతరాలు తెలుపడంతో తర్వాత ‘మిస్టర్ నూకయ్య’ గా మార్చారు.
14)’పట్టపగలు’ టు ‘దెయ్యం’ : రాజశేఖర్ – రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో ‘పట్టపగలు’ అనే సినిమా మొదలైంది. తర్వాత ‘దెయ్యం’ గా మార్చి దాన్ని రిలీజ్ చేశారు.
15) ‘రంగస్థలం 1985’ టు ‘రంగస్థలం’ : రాంచరణ్- సుకుమార్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీకి మొదట ‘రంగస్థలం 1985’ టైటిల్ పెట్టారు. తర్వాత అది ‘రంగస్థలం 1985’ గా మార్చారు.
16)RGV’s NTR టు లక్ష్మీస్ NTR : రాంగోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో ఎన్‌టిఆర్ బయోపిక్ రూపొందింది. RGV’s NTR గా మొదలైన ఈ సినిమా రిలీజ్ టైమ్ కి లక్ష్మీస్ NTR గా మారింది.
17)’గ్యాంగ్ లీడర్’ టు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ : నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. మొదట ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టారు. తర్వాత ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ గా మార్చారు.
18)’బెజవాడ రౌడీలు’ టు ‘బెజవాడ’ : నాగ చైతన్య హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన సినిమా ఇది. మొదట ‘బెజవాడ రౌడీలు’ గా టైటిల్ అనౌన్స్ చేశారు. తర్వాత ‘బెజవాడ’ గా రిలీజ్ అయ్యింది.
19)’కాటమరాయుడు’ టు ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ : సప్తగిరి హీరోగా తెరకెక్కిన సినిమాకి మొదట ‘కాటమరాయుడు’ టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ టీమ్ రిక్వెస్ట్ చేయడంతో అది ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ గా రిలీజ్ అయ్యింది.
20)’భవదీయుడు భగత్ సింగ్’ టు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ : హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కలయికలో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. ఇప్పుడు అది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా వస్తోంది.