Adiseshagiri Rao: నరేష్ తో మాకు సంబంధం లేదు.. ఆదిశేషగిరిరావు కామెంట్స్ వైరల్!

  • May 27, 2023 / 06:58 PM IST

సినీ ఇండస్ట్రీలో నటుడు నరేష్ ప్రస్తుతం సంచలనంగా మారారు. ఈయన పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉండడమే కాకుండా మా రిలేషన్ కి కృష్ణ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది అంటూ పలు సందర్భాలలో తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా తిరిగి విడుదల కానున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన నటుడు నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా కృష్ణ విజయనిర్మల దంపతుల కుమారుడు వికె నరేష్ పైన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. కృష్ణ గారు మరణించాక పార్థివ దేహాన్ని నానక్ రామ్ గూడలో ఒంటరిగా వదిలేశారని.. అక్కడ నరేష్ లేరని ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. రమ్య రఘుపతి షేర్ చేసిన ఈ వీడియో చూసి ఎంతో మంది కృష్ణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఒక గొప్ప మహనీయుడు చనిపోతే కనీసం ఆయన పార్తివ దేహం వద్ద ఒక్కరు కూడా లేని పరిస్థితి ఏర్పడింది.

అంటూ బాధపడ్డారు తాజాగా ఈ విషయంపై (Adiseshagiri Rao) ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. అసలు ఈ నరేష్ ఎవరు అంటూ వ్యాక్యానించారు. కృష్ణ పార్థివ దేహం వద్ద మా అబ్బాయి, మా మేనల్లుడు ఉన్నారు అక్కడ మహేష్ లేకపోతే ఎవరూ లేనట్టా అని ప్రశ్నించారు. నరేష్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన గొడవల గురించి కూడానేను మాట్లాడదలచుకోలేదు.

ఇక రమ్య రఘుపతి షేర్ చేసిన ఆ వీడియో కూడా తాను ఇప్పటివరకు చూడలేదని ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఒకే ఏడాదిలోనే తన అన్నయ్య వదిన రమేష్ బాబు మరణించడంతో తన ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్ లో ఉండిపోయిందని ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు తెలియజేశారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus