సిద్ధార్థ్,అదితి రావు హైదరి ‘మహాసముద్రం’ సినిమా టైంలో కలుసుకున్నారు. ఆ సినిమాలో వీళ్ళు చాలా క్లోజ్ అయ్యారు. అందుకు తగ్గట్టే సన్నివేశాలు రాసినట్టున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. సిద్దార్థ్, అదితి .. ఇప్పుడు కలిసే ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. డాన్స్ వీడియోలు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సిద్దార్థ్ సినిమాలను అదితి ప్రమోట్ చేస్తుంది. ఈ మధ్యనే ఆమెకు సంబంధం లేని ‘టక్కర్’ ని దగ్గరుండి తన సోషల్ మీడియాలో ప్రమోట్ చేసింది.
ఇక అదితి (Aditi Rao Hydari) బర్త్ డే వస్తే ‘మై క్వీన్’ అంటూ సిద్దార్థ్ పోస్టులు పెడుతున్నాడు. ఇలా ఇన్ని చేసినా.. ‘మీరు ప్రేమలో ఉన్నారా?’ అని అడిగితే మాత్రం వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. మొన్నటికి మొన్న ‘టక్కర్’ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన సిద్దార్థ్ .. తన గురించి ఏవేవో గాసిప్స్ ప్రచారం చేస్తున్నట్లు ఓ పావుగంట మీడియాకి క్లాస్ పీకాడు. అదితి కూడా ఏమీ తక్కువ కాదు. తాజాగా ఆమెకు ఈ విషయమై ఓ ప్రశ్న ఎదురవ్వగా.. దానికి ఆమె మండిపడింది.
‘నా స్నేహితులు, నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం.. నాకు చాలా ప్రత్యేకమైనవి. వాటి గురించి నేను సరైన సమయంలో స్పందిస్తాను. జనాలు వారికి ఏది ముఖ్యమైతే దాని గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను. నేను డిప్లొమాటిక్ గా , పొలైట్ గా ఉండను. నేను నిజాన్ని మాత్రమే నమ్ముతాను’ అంటూ ఏంటేంటో చెప్పుకొచ్చింది. ఓవరాల్ గా ఆమె సరైన సమయంలో ఈ విషయం గురించి స్పందిస్తాను అని చెప్పింది మాత్రమే జనాల్లోకి వెళ్లొచ్చు.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!