Samajavaragamana Review in Telugu: సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శ్రీవిష్ణు, (Hero)
  • రెబా మోనికా జాన్ (Heroine)
  • నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ తదితరులు.. (Cast)
  • రామ్ అబ్బరాజు (Director)
  • రాజేష్ దండా - అనిల్ సుంకర (Producer)
  • గోపీసుందర్ (Music)
  • రామ్ రెడ్డి (Cinematography)
  • Release Date : జూన్ 29, 2023

“రాజరాజచోర” లాంటి డీసెంట్ హిట్ తర్వాత పలు ఫ్లాప్ లు చవిచూసిన శ్రీవిష్ణు.. తన కంఫర్ట్ జోన్ అయిన కామెడీ జోనర్ లోకి వచ్చేసి నటించిన సినిమా “సామజవరగమన”. సినిమా సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. అయితే.. సినిమా కోసం వేసిన స్పెషల్ ప్రీమియర్స్ వల్ల సినిమాకి మంచి బజ్ వచ్చింది. మరి శ్రీవిష్ణు మళ్ళీ హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!

కథ: ఓ భారీ బ్యాగ్రౌండ్ ఉన్న మిడిల్ క్లాస్ కుర్రాడు బాలు (శ్రీవిష్ణు), తండ్రి (నరేష్)ను డిగ్రీ పాస్ చేయించడమే జీవిత ధ్యేయంగా.. సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్ లో వర్క్ చేస్తుంటాడు. ఇంటికి పేయింగ్ గెస్ట్ గా వచ్చి.. బాలు లైఫ్ లోకి ఎంటరవుతుంది సరయు (రెబా మోనిక). కొన్ని కుదుపుల తర్వాత ఊపందుకున్న వారి ప్రేమకు.. ప్రపంచంలో ఎవ్వరికీ రాని సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యను బాలు ఎలా అధిగమించాడు? అనేది “సామజవరగమన” కథాంశం.

నటీనటుల పనితీరు: శ్రీవిష్ణు మరోమారు తన కామెడీ టైమింగ్ తో హిలేరియస్ గా ఎంటర్ టైన్ చేశాడు. అతడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా.. ప్రెజంట్ జనరేషన్ ఆడియన్స్ కు శ్రీవిష్ణు క్యారెక్టరైజేషన్ బాగా కనెక్ట్ అవుతుంది. మలయాళ ముద్దుగుమ్మ రెబా మోనిక జాన్.. తెలుగులో మంచి డెబ్యూ ఇచ్చిందనే చెప్పాలి. అందంతోపాటు.. అభినయంతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా డ్యాన్స్ మూవ్స్ తో అలరించింది.

నరేష్ మళ్ళీ తన కామెడీ పంచ్ లతో అదరగొట్టాడు. ఆయన పాత్ర, ఆయన డైలాగులు ఆడియన్స్ విశేషంగా ఎంజాయ్ చేస్తారు. యూత్ కూడా కనెక్ట్ అయ్యే స్థాయిలో నరేష్ పాత్ర ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సెకండాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ ఉన్న కాసేపు కడుపుబ్బ నవ్వించాడు. కులశేఖర్ పాత్రలో కిషోర్ నటన అమితంగా ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్, జెమిని సురేష్, దేవీ ప్రసాద్ వంటి సీజన్ద్ ఆర్టిస్టులందరూ పాత్రకు తగ్గట్ట్లుగా నటించి అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. సినిమాను చాలా నీట్ & బ్రైట్ గా చూపించి.. సినిమా యొక్క మూడ్ ని బాగా ఎలివేట్ చేశాడు. గోపీసుందర్ బాణీలు సోసోగా ఉండగా.. సాహిత్యం కారణంగా ఆ పాటలు ఆడియన్స్ ను అలరించలేకపోయాయి. ఇక.. సదరు పాటల ప్లేస్ మెంట్ కూడా ఇరికించినట్లుగా ఉండడంతో, రెబా మోనికా గ్లామర్ తప్ప పాటలు సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి.

రామ్ అబ్బరాజు & భాను భోగవరపు & కౌశిక్ మహత త్రయం రాసుకున్న కథ చాలా సింపుల్ గా ఉన్నా.. ట్విస్ట్ మాత్రం ఎవ్వరూ ఊహించనలేని విధంగా ఉంది. అలాగే.. స్క్రీన్ ప్లే కూడా ఎక్కువ మెలికలు లేకుండా సింపుల్ గా రాసుకొని, ఆడియన్స్ ను కామెడీతో ఎక్కువగా అలరించారు. మరీ ముఖ్యంగా.. ప్రెజంట్ జనరేషన్ ఆడియన్స్ & యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్న మీమ్స్ ఫార్మాట్ లో రాసుకున్న సంభాషణలు, స్పూఫ్ లు భలే పేలాయి.

అలాగే.. దర్శకుడు రామ్ అబ్బరాజు సన్నివేశాలను కంపోజ్ చేసుకున్న తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా తన మొదటి రెండు సినిమాల్లో జరిగిన తప్పులను రిపీట్ అవ్వకుండా ప్లాన్ చేసుకొని దర్శకుడిగా మంచి విజయం సొంతం చేసుకున్నాడనే చెప్పాలి. అయితే.. ఫస్టాఫ్ లో ఉన్న పేస్ సెకండాఫ్ లో మిస్ అయ్యింది. మరీ ముఖ్యంగా.. సెకండాఫ్ లో వచ్చే రాకీ ఎపిసోడ్ మరీ ఎక్కువగా సాగింది. అలాగే.. రాజీవ్ కనకాల క్యారెక్టర్ & శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు మరీ ప్రెడిక్టబుల్ గా ఉండడం, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ముందే ఊహించగలిగింది కావడం చిన్నపాటి మైనస్ లుగా చెప్పుకోవాలి.

విశ్లేషణ: సెకండాఫ్ లో వచ్చే చిన్నపాటి ల్యాగ్ ను ఇగ్నోర్ చేయగలిగితే.. “సామాజవరగమన” విశేషంగా ఆకట్టుకుంటుంది. శ్రీవిష్ణు-నరేష్ కాంబినేషన్ కామెడీ, సుదర్శన్-వెన్నెల కిషోర్ కామెడీ పంచ్ లు, రెబా మోనికా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణలుగా తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ రిలీజులతో ఢీలాపడిన తెలుగు సినిమా బాక్సాఫీస్ ను జీవం పోస్తుందని చెప్పాలి. అయితే.. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నా, ఆ కంటెంట్ ను ఎలివేట్ చేసే స్థాయిలో సినిమా ప్రమోషన్స్ లేకపోవడం గమనార్హం.

ఇక సినిమాకి కలెక్షన్స్ లేదా మంచి ఓపెనింగ్స్ రాకపోతే.. అందుకు ముఖ్యకారణ ట్రైలర్ అని చెప్పాలి. ఇంత చక్కని కంటెంట్ పెట్టుకొని.. మేకర్స్ ఆ సగం ఉడికిన ట్రైలర్ ను ఎలా బయటకి వదిలారో ఎవ్వరికీ అర్ధం కాని ప్రశ్న. కనీసం.. ఇప్పుడైనా సినిమాను కంటెంట్ పరంగా ప్రమోట్ చేస్తే.. సైలెంట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగలిగే సత్తా ఉన్న చిత్రమిది.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus