SPY Review in Telugu: స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నిఖిల్ సిద్ధార్ధ్, (Hero)
  • ఐశ్వర్యమీనన్ (Heroine)
  • అభినవ్ గోమటం, మకరంద్ దేష్ పాండే, జిషు సేన్ గుప్తా, ఆర్యన్ రాజేష్ తదితరులు.. (Cast)
  • గ్యారీ బీహెచ్ (Director)
  • కె.రాజశేఖర్ ఉప్పలపాటి (Producer)
  • విశాల్ చంద్రశేఖర్ - శ్రీచరణ్ పాకాల (Music)
  • మార్క్ డేవిడ్ (Cinematography)
  • Release Date : ED ఎంటర్టైన్మెంట్స్

“కార్తికేయ 2” సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నిఖిల్ టైటిల్ పాత్రలో రూపొందిన తాజా చిత్రం “స్పై”. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ సినిమాపై అంచనాలను విశేషంగా పెంచాయి. ముఖ్యంగా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన ఫైల్స్ గురించి సినిమా కాన్సెప్ట్ అని తెలిసినదగ్గరనుంచి.. సినిమాపై ఎక్కడలేని ఆసక్తి పెరిగింది. మరి ఈ క్రేజ్ ను నిఖిల్ & టీం సరిగా వినియోగించుకోగలిగారా? “స్పై”తో నిఖిల్ మరో పాన్ ఇండియన్ హిట్ కొట్టాడా? వంటి ప్రశ్నలకు సమాధానాలు సమీక్షలో తెలుసుకొందాం..!!

కథ: తన అన్నయ్య బోస్ (ఆర్యన్ రాజేష్) ఆకస్మిక మరణం వెనుక నిజాలు బయటపెట్టడం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటాడు జై (నిఖిల్). రా ఏజెన్సీలో ఒన్నాఫ్ ది టాప్ స్పై అయిన జైకు.. ఇండియాకి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ ఆపరేషన్ ను లీడ్ చేసే బాధ్యత అప్పగిస్తాడు చీఫ్ శాస్త్రి (మకరంద్ దేష్ పాండే). ఆ ఆపరేషన్ లీడ్ చేస్తున్న తరుణంలో.. తన అన్నయ్య మరణానికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు జైకి తెలుస్తాయి.

అదే సమయంలో ఇండియన్ రా ఏజెన్సీ ఆఫీస్ నుంచి సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన కొన్ని కీలకమైన ఫైల్స్ మిస్ అవుతాయి. అసలు టెర్రరిస్టులకు ఆ ఫైల్స్ తో పని ఏంటీ? దానికి జై అన్నయ్య బోస్ హత్యకు సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “స్పై” చిత్రం.

నటీనటుల పనితీరు: ఒక యంగ్ & సిన్సియర్ స్పైగా నిఖిల్ తన పాత్రలో జీవించేశాడు. బాడీ లాంగ్వేజ్ కూడా బాగా మ్యాచ్ చేశాడు. ముఖ్యంగా.. ఎమోషనల్ సీన్స్ లో నిఖిల్ నటన విజిల్స్ వేయిస్తుంది. రా చీఫ్ శాస్త్రిగా మకరంద్ దేశ్ పాండే క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. ఈ తరహా పాత్రల్లో రెగ్యులర్ ఆర్టిస్టులను కాకుండా.. ఇలా మకరంద్ ను తీసుకోవడం వల్ల, ఆ పాత్రకు కాస్త నవ్యత తీసుకొచ్చారు.

ఐశ్వర్యమీనన్ ను రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్ లా పాటలకు పరిమితం చేయకుండా.. కథలో కీలకపాత్రధారిగా మలచిన తీరు బాగుంది. ఆమె కూడా చక్కగా నటించింది.ఆర్యన్ రాజేష్ ది అతిధి పాత్రే అయినప్పటికీ.. తన స్క్రీన్ ప్రెజన్స్ తో కథకు కావాల్సిన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అభినవ్ స్పై ఏజెంట్ గా చేసే కామెడీ ఆడియన్స్ ను అలరిస్తుంది. జిషు సేన్ గుప్తా, రవివర్మ, నితిన్ మెహతాలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడిగా తన మొదటి చిత్రమైనప్పటికీ.. బాధ్యతతో హ్యాండిల్ చేశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ఇన్వాల్వ్ అయ్యుండడంతో.. ఈ సినిమాపై నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఛేజింగ్ సీక్వెన్స్ లు, క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం ఆడియన్స్ ను అలరిస్తుంది. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం మరియు సమకూర్చిన కొన్ని పాట సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

విశాల్ చంద్రశేఖర్ పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. హాలీవుడ్ యాక్షన్ లుక్స్ కోసం ట్రై చేసిన ఫ్రేమింగ్స్ & టింట్ కలర్స్ బాగున్నాయి. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఇక చిత్ర నిర్మాత మరియు రచయిత అయిన రాజశేఖర్ సబ్జెక్ట్ మీద మంచి రీసెర్చ్ చేశాడు. ముఖ్యంగా నేతాజీ సైన్యంపై.. భారత సైన్యం చేసిన యుద్ధం తాలూకు విషయాలను వివరించిన విధానం ప్రశంసనీయం.

విశ్లేషణ: తెలుగు సినిమా నుంచి వచ్చిన ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా (SPY) “స్పై”. నిఖిల్ నటన, సుభాష్ చంద్రబోస్ గూర్చి చర్చించిన విషయాలు, కొన్ని చారిత్రాత్మక యుద్ధాల గురించి వివరించిన సందర్భాలు, శ్రీచరణ్ పాకల నేపధ్య సంగీతం కోసం ఈ చిత్రాన్ని తప్పకుండా చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

Click Here To Read in ENGLISH

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus