యంగ్ టైగర్ ఎన్టీఆర్, (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ కొన్నేళ్ల క్రితం జనతా గ్యారేజ్ (Janatha Garage) సినిమాతో ప్రేక్షకులను మెప్పించిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ క్లాస్ రోల్ లో మాస్ యాక్టింగ్ తో అదుర్స్ అనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత తారక్ కొరటాల శివ కాంబోలో దేవర (Devara) టైటిల్ తో సినిమా తెరకెక్కగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర రిలీజ్ ట్రైలర్ తెలుగు వెర్షన్ కు ఇప్పటివరకు 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
వర, భైరా పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర అడిగినాడంటే సెప్పినాడని అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. చాలా సంవత్సరాల తర్వాత తారక్, కొరటాల శివ కాంబో రిపీట్ అవుతుండటం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమని చెప్పవచ్చు. దేవర సినిమా బుకింగ్స్ కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే మొదలు కాగా బుకింగ్స్ విషయంలో దేవర తెలుగు వెర్షన్ అదుర్స్ అనిపిస్తోంది.
దేవర సినిమా రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ కళకళలాడటం పక్కా అని చెప్పవచ్చు. ఉదయం 4 గంటల నుంచి బెంగళూరులో దేవర షోలు ప్రదర్శితం కానున్నాయి. అయితే కర్ణాటకలో కూడా మిడ్ నైట్ షోలు ప్రదర్శితం అయ్యేలా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దేవర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సైఫ్ పాత్ర తలపై కత్తి పెట్టడం ట్రైలర్ లో అదుర్స్ అనేలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో వచ్చిన కొన్ని నెగిటివ్ కామెంట్లను సైతం పరిగణనలోకి తీసుకుని మార్పులు చేశారని సమాచారం.