హీరో కొడుకు హీరో అవుతాడు.. అని అంటుంటారు. అలాగే హీరో కూతురు ఎక్కువగా నిర్మాత అవుతుంది అని అంటుంటారు. (హీరోయిన్లు అయినా పెద్ద నిలదొక్కుకోలేదనే విషయం తెలిసిందే.) ఇప్పటివరకు టాలీవుడ్‌లో పెద్ద హీరోల విషయంలో, వారి వారసుల విషయంలో ఇదే జరిగింది. జరుగుతోంది కూడా. అయితే రవితేజ (Ravi Teja) వారసుల విషయంలో ఒకటి పైన చెప్పినట్లుగానే జరిగింది. ఇంకొక విషయంలో తేడా కొట్టింది. రవితేజను కొన్నేళ్ల క్రితం మీ వారసులు సినిమా రంగంలోకి వస్తారా? అని అడిగితే..
ఏమో వాళ్ల ఇష్టం ఎలా చేస్తా అంటే అలా అని సగటు తండ్రిలా మాట్లాడారు. అయితే మహాధన్ హీరో అవుతాడు అని చూచాయగా చెప్పారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు మహాధన్ దర్శకత్వ విభాగంలో చేరాడు. అవును ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దగ్గర మహాధన్ దర్శకత్వ విభాగంలో వర్క్ చేస్తున్నాడట. హీరోగా వస్తాడా లేదా అనేది తెలియదు కానీ.. ఇలా దర్శకత్వ విభాగంలో పని చేస్తే చాలా విషయాల మీద అవగాహన వస్తుంది అని మహాధన్ ఆలోచన అని అంటున్నారు.
మరోవైపు రవితేజ తన నిర్మాణ రంగంలోకి వచ్చారట. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో ఆమె మెళకువలు నేర్చుకుంటున్నారని సమాచారం. అన్నీ ఓకే అనుకున్నాక అప్పుడు సొంతంగా సినిమా చేస్తారట. మరి రవితేజ నిర్మాణ ఆర్టీ టీమ్ వర్క్స్‌లో సినిమాలు చేస్తుందా లేక సొంత నిర్మాణ సంస్థ పెడతారా అనేది చూడాలి. ఇక మహాధన్ సంగతి అంటారా? తండ్రి కూడా ఇలానే దర్శకత్వ రంగం నుండి వచ్చి హీరో అయినవాడే.
కాబట్టి మహాధన్ కూడా అలానే వస్తాడు అని అభిమానులు అంటున్నారు. ఇక్కడో విషయం ఏంటంటే మహాధన్ పని చేస్తోంది ప్రభాస్ సినిమాకు. అవును సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ అతనితోనే. కాబట్టి ప్రభాస్ (Prabhas) – మహాధన్ మధ్య మంచి ర్యాపో క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం మహాధన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఏంటో?