RRR పోస్టర్.. మళ్ళీ కాపీ ట్రోలింగ్స్

  • January 26, 2021 / 11:19 AM IST

దర్శకధీరుడు రాజమౌళి బిగ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న RRR సినిమా గురించి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు మూడవసారి కూడా అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. కానీ సినిమా వచ్చేవరకు అది నిజమని నమ్మడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ కోసం విడుదలైన హై వోల్టేజ్ పోస్టర్ పై అనేక రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ పోస్టర్ ను హాలీవుడ్ సినిమా నుంచి లేపేశారని తెలుస్తోంది.

ఇదివరకే నేషనల్ జియోగ్రఫీ ఫుటేజ్ ను భీమ్ టీజర్ లో కలిపేసిన జక్కన్న ఇప్పుడు ఘోస్ట్ రైడర్ స్టైల్ లో పోస్టర్ ను దింపేశాడని ట్రోల్స్ వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బైక్ పై ఉండగా రామ్ చరణ్ గుర్రపు స్వారితో కనిపిస్తూ అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా చేశారు. అయితే ఘోస్ట్ రైడర్ సినిమాలో కూడా దాదాపు అలాంటి లుక్స్ ఉండడంతో ట్రోలింగ్ డోస్ పెరిగిపోయింది. తస్కరించారు అంటూ మీమ్స్ ఎక్కువగా వస్తున్నాయి.

మరి ఈ విషయంపై RRR టీమ్ ఎప్పటిలానే మౌనం పాటిస్తుందో లేదో చూడాలి. ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను రెగ్యులర్ గా ఇవ్వాలని చిత్ర యూనిట్ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఇప్పటికే ట్యూన్స్ రెడీ చేయగా త్వరలోనే ఒక పాట రావచ్చని అంటున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus