Ahimsa Collections: ‘అహింస’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

  • June 5, 2023 / 12:20 AM IST

సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా తమ్ముడు, సురేష్ బాబు తనయుడు అయిన అభిరామ్ హీరోగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం ‘అహింస’. ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్‌ పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గీతికా తివారి హీరోయిన్. జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. హీరోయిన్ పై అత్యాచారం చేసిన ఊరి పెద్ద కొడుకులపై అహింసాత్మకంగా న్యాయ పోరాటం చేయాలనుకుంటాడు హీరో.

అతను అహింస (Ahimsa) పోరాటం ప్రేక్షకులకి నచ్చలేదు. పైగా మితిమీరిన వయొలెన్స్ ఉంది. అభిరామ్ కు ఈ మూవీ సరైన డెబ్యూ కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పటికి రిలీజ్ అయ్యింది. ఇక బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ‘అహింస’ చిత్రాన్ని చాలా వరకు సురేష్ ప్రొడక్షన్స్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయినప్పటికీ మెయింటెనెన్స్ లు, రెంట్లు.. వంటివి రికవరీ అవ్వాలి అంటే రూ.2 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలట. కానీ ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.16 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టిందట. మొదటి రోజు చాలా చోట్ల జనాలు లేక ఈ మూవీ షోలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. వీకెండ్ ముగిసేవరకు ఈ మూవీ ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus