విజయ్ సినిమా అంటే చాలు అవి ఉంటాయా… అని అడుగుతున్నారట

  • January 31, 2020 / 08:41 PM IST

అనతి కాలంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. సినిమాలో కావచ్చు బయట కావచ్చు అతని బోల్డ్ ఆటిట్యూడ్ కి యూత్ ఫ్యాన్స్ అయిపోయారు. ఇక విజయ్ సినిమాలంటే బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ కామన్ అన్నట్లు అయ్యింది పరిస్థితి. ఇందుకు ఉదాహరణే నేటి ఇంటర్వ్యూలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్. ఈ నెల 14న విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ విడుదల ఉంది. దీనితో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నేడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఐతే ఓ విలేకరి ఆమెను వరల్డ్ ఫేమస్ లవర్ లో బోల్డ్ సీన్స్ ఉన్నట్టున్నాయి.మీరు కూడా లిప్ లాక్స్ వంటి సన్నివేశాలలో నటించారా…? అని అడుగగా… చాలా మంది నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. విజయ్ సినిమా అయినంత మాత్రాన అలాంటి సన్నివేశాలు ఉండాల్సిన పనిలేదు. ఒక వేళ ఉన్నా, పాత్ర మరియు సన్నివేశం డిమాండ్ చేస్తే నటించడంలో తప్పులేదు. ఇక నేను అలాంటి సన్నివేశాలలో నటించానో లేదో సినిమా చూసి తెలుసుకోండి అని, బదులిచ్చారు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం టీజర్ చూసిన తరువాత విజయ్ ని అందరూ టాలీవుడ్ హిమేష్ రేష్మియా అనుకుంటున్నారట.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus