బన్నీ లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తే మతి పోవాల్సిందే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మాయిలకేంటి.. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఏంటి.. ముఖ్యంగా నిబ్బాస్ .. ఆయనంటే పడి చస్తారు. డ్రెస్సింగ్ దగ్గర్నుండీ మొదలు హెయిర్ స్టైల్, కళ్ళజోడు అన్నిటిలో చాలా స్టైల్ గా ఉంటూ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తాడు బన్నీ. ఇక యాక్టింగ్, డ్యాన్స్ విషయంలో ఆయన స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ స్టేజి మీద మాట్లాడే తీరు అలాగే సినిమాల్లో చెప్పే డైలాగులు కూడా ఎంతో స్టైల్ గా ఉంటాయి.

ఇది పక్కన పెడితే.. అల్లు అర్జున్ మినిమం గ్యారంటీ హీరో అనే ముద్ర ఎప్పటి నుండో ఉంది. ఈయన తీసిన 19 సినిమాల్లో రెండు, మూడు సినిమాలు మాత్రమే డిజాస్టర్లు అయ్యాయి. కాబట్టి బన్నీకి రెమ్యునరేషన్ భారీగానే ఇస్తుంటారు. ఇక ఈ సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి1’ నే బీట్ చేసేంత బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తుంటే.. ఎవ్వరికైనా మతిపోవాల్సిందే.

బన్నీకి 5 కార్లు వరకూ ఉన్నాయి. 64 లక్షలు విలువ గల రేంజ్ రోవర్ కారు ఒకటి కాగా…

80 లక్షలు విలువ గల బి.ఎం.డబ్ల్యు మరో కారు.

వీటితో పాటు 88.58 లక్షల విలువగల ‘ఆడి ఏ7’ కారు,

1.2 కోట్ల జాగ్వార్ ఎక్స్.జె.ఎల్ కార్లు ఉన్నాయి.

గతేడాది 2.3 కోట్ల రేంజ్ రోవర్ హై ఎండ్ కారుని కూడా కొనుగోలు చేసాడు బన్నీ.

అల్లు అర్జున్ ఇంటి ఖరీదు దాదాపు 100 కోట్లట.

హైదరాబాద్ లో ఉన్న కాస్ట్లీ పబ్ లలో ‘హై లైఫ్’ ఒకటి. ఇది కూడా బన్నీ దే..!

మొన్నామధ్య ఓ ప్రీ రిలీజ్ వేడుకకి అతిధిగా విచ్చేసిన బన్నీ.. ఓ టీ.షర్ట్ వేసుకొచ్చాడు. దీని ఖరీదు 65 వేలట.

కొద్ది రోజుల క్రితం ఓ కార్ వ్యాన్ ను డిజైన్ చేయించుకున్నాడు బన్నీ. దీని ఖరీదు 7 కోట్లని తెలుస్తుంది.

వీటితో పాటు తనకంటూ ప్రత్యేకమైన ఇంటిని, ఆఫీస్ ని నిర్మించుకోడానికి బన్నీ ప్లాన్ చేస్తున్నాడట. ఇవి కూడా చాలా ఖరీదయినవే అని సమాచారం.


డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus