అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

రాజమౌళి ‘బాహుబలి’ ని మించి ఏ స్టార్ హీరో సినిమా కూడా అత్యధిక కలెక్షన్ లు రాబట్టలేకపోతుంది అనడంలో సందేహం లేదు. బాహుబలి రేంజ్ బడ్జెట్ పెట్టి తీసినా అది సాధ్యం కావడం లేదు. ఇప్పటికే స్టార్ హీరోలు ఆ దిశగా ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. అయితే మన టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలే నిర్మాతలకు అత్యధిక లాబాల్ని అందించాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) గీత గోవిందం : విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా పరశురామ్(బుజ్జి) డైరెక్షన్ లో తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం ఏకంగా 55.43 కోట్ల లాభాల్ని అందించింది. ఈ చిత్రానికి కేవలం 15 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. మొత్తంగా ఈ చిత్రం 70 షేర్ ను వసూల్ చేసింది.

2) ఫిదా : వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘ఫిదా’ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడు.ఈ చిత్రం 30.5 కోట్ల లాభాల్ని అందించింది. ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ కేవలం 18 కోట్లు. ఫుల్ రన్ లో ఈ చిత్రం 48.5 కోట్ల షేర్ ను వసూల్ చేసింది.

3) ఇస్మార్ట్ శంకర్ : రామ్ , నభా నటేష్, నిధి అగర్వాల్, కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం 22.78 కోట్ల లాభాల్ని అందించింది. ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ కేవలం 17 కోట్లు. ఫుల్ రన్ లో ఈ చిత్రం 36 నుండీ 40 కోట్ల మధ్యలో షేర్ ను రాబట్టినట్టు సమాచారం.

4) అర్జున్ రెడ్డి : విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ 20.30 కోట్ల లాభాల్ని అందించింది. ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ కేవలం 5.5 కోట్లు. ఫుల్ రన్ లో ఈ చిత్రం 25.8 కోట్ల షేర్ ను వసూల్ చేసింది.

5) మజిలీ : చైసామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రం 19.2 కోట్ల లాభాల్ని అందించింది. ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ 21.14 కోట్లు. ఫుల్ రన్ లో ఈ చిత్రం 36 కోట్ల నుండీ 42 కోట్ల మధ్యలో షేర్ ను వసూల్ చేసిందని సమాచారం.

6) అ ఆ : నితిన్, సమంత జంటగా నటించిన ఈ సూపర్ హిట్ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. ఈ చిత్రం కూడా 19 కోట్ల లాభాల్ని అందించింది. ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ 30 కోట్లు. ఫుల్ రన్ లో ఈ చిత్రం 49 కోట్ల వరకూ షేర్ ను వసూల్ చేసింది.

7) భలే భలే మగాడివోయ్ : నేచురల్ స్టార్ నాని హీరోగా మారుతీ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం 18.8 కోట్ల లాభాల్ని అందించింది. ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ కేవలం 8.4 కోట్లు కాగా ఫుల్ రన్ లో 27 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది.

8) ప్రతీరోజూ పండగే : సాయి తేజ్, దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం 16.26 కోట్ల లాభాల్ని అందించింది. ఈ చిత్రానికి 18 కోట్ల బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 34 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది.

9) శతమానం భవతి : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం 15 కోట్ల లాభాలను ను అందించింది. ఈ చిత్రానికి బిజినెస్ 19 కోట్ల మాత్రమే జరిగింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 34 కోట్ల షేర్ ను రాబట్టింది.

10) నేను లోకల్ : నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రానికి త్రినాధ్ రావు దర్శకుడు. ఈ చిత్రం 14.6 కోట్ల లాభాల్ని అందించింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 35 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus