Dil Raju,Ajith: దిల్ రాజుని తిట్టిపోస్తున్నారుగా!

  • December 26, 2022 / 07:00 PM IST

టాలీవుడ్ లో చాలా మంది అగ్ర హీరోలతో సినిమాలు తీశారు నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ‘వారసుడు’ పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు విషయంలో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా దిల్ రాజు చేసిన ఒక కామెంట్ దుమారం రేపింది.

తమిళంలో విజయే నెంబర్ వన్ హీరో అని.. సంక్రాంతికి రిలీజ్ కానున్న అజిత్ సినిమా ‘తునివు’ కంటే దీనికి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని అడుగుతానని ఆయనొక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కామెంట్స్ తమిళనాట దుమారం రేపాయి. విజయ్ ను నెంబర్ వన్ హీరో అనడం, అజిత్ సినిమా కంటే విజయ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలనడం అజిత్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. అప్పటినుంచి దిల్ రాజు.. అజిత్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయిపోయారు.

పోనీ దిల్ రాజు ఏదో ఫ్లోలో అలా మాట్లాడి ఉంటారేమోనని అనుకుంటే.. తాజాగా చెన్నైలో జరిగిన ‘వరిసు’ ఆడియో వేడుకల్లో మళ్లీ అజిత్ అభిమానులను ఉడికించేలా మాట్లాడారు దిల్ రాజు. ‘వరిసు’ సినిమాకి ఎలివేషన్ ఇచ్చే క్రమంలో ఈ సంక్రాంతి మాదే అని దిల్ రాజు స్టేట్మెంట్ ఇవ్వడం అజిత్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. మరోపక్క ‘తునివు’ డైరెక్టర్ వినోద్.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంక్రాంతికి ‘తునివు’ సినిమాతో పాటు ‘వరిసు’ కూడా బాగా ఆడాలని అన్నారు.

దిల్ రాజు మాత్రం ‘సంక్రాంతి మాదే’ అంటూ చెప్పడం.. దానికి వంశీ పైడిపల్లి సపోర్ట్ చేస్తూ మాట్లాడడాన్ని అజిత్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఈ స్టేట్మెంట్ తరువాత అజిత్ ఫ్యాన్స్ మరోసారి దిల్ రాజుని టార్గెట్ చేస్తున్నారు. కావాలనే అజిత్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతూ దిల్ రాజు మాట్లాడుతున్నారని ట్రోలింగ్ చేస్తున్నారు. అభిమానుల మధ్య గొడవలు పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus