టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

  • December 15, 2022 / 06:58 PM IST

ఇండియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది.. కంటెంట్ బాగుంటే బాషతో సంబంధం లేకుండా చూస్తున్నారు.. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తో మరో మెట్టు పైకి ఎక్కించారు.. ట్రిపులార్ జపాన్, ‘పుష్ప’ రష్యా లాంటి దేశాల్లో విడుదలై సందడి చేస్తున్నాయి.. టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయిలో పాగా వేస్తోంది.. ట్రిపులార్ అయితే ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది.. సౌత్ ఇండస్ట్రీ నుండి ఈ 2022లో ఇండస్ట్రీ హిట్స్, సాలిడ్ బ్లాక్ బస్టర్స్, రికార్డ్ క్రియేట్ చేసిన మూవీస్ వచ్చాయి..

ఇటీవల నెటిజన్లు గూగుల్‌లో ఏ ఏ సినిమాలను ఎక్కువగా సెర్చ్ చేశారో.. వాటి తాలూకా టాప్ 10 లిస్ట్ రిలీజ్ చేసింది గూగుల్.. వాటిలో ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి తెలుగు సినిమాలు ఉన్నాయి.. ఇప్పుడు ఐఎండీబీ కూడా ఓ లిస్ట్ విడుదల చేసింది.. తెలుగు, కన్నడ, తమిళ్ చిత్రాలు ముందు వరుసలో ఉండగా.. మలయాళం సినిమాలకు టాప్ 10లో చోటుదక్కలేదు.. హిందీ నుండి ఒకే ఒక్క మూవీ చోటు దక్కించుకుంది..

వాటిలో ఈ ఏడాది పాపులర్ ఇండియన్ మూవీస్ ఏవి?.. ఏ ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు టాప్ 10లో ఉన్నాయి?.. ఏ సినిమాల గురించి జనాలు ఎక్కువగా సెర్చ్ చేశారు అనే వివరాలు వెల్లడించింది.. టాప్ 10లో ఉన్న సినిమాలే టాప్ అని కాదు కానీ.. ఒక్కో పరిశ్రమ నుండి ఎక్కువగా సెర్చ్ చేసినవి ఇవి.. మిగతా ప్రజాదరణ పొందిన చిత్రాలు ఇతర స్థానాల్లో నిలిచాయి.. ఐఎండీబీ లిస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

టాలీవుడ్..

1. ఆర్ఆర్ఆర్

2. మేజర్

3. సీతా రామం

శాండల్ వుడ్..

1. కె.జి.యఫ్ – 2

2. కాంతార

3. 777 ఛార్లీ

కోలీవుడ్..

1. విక్రమ్

2. పొన్నియన్ సెల్వన్

3. రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్

బాలీవుడ్..

1. ది కశ్మీరీ ఫైల్స్

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus