ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!

  • December 15, 2022 / 06:52 PM IST

ఈ ఏడాది తెలుగులో హిట్ అయిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. ముఖ్యంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకు ముఖ్య కారణంగా ఓటీటీలు అని కూడా చెప్పాలి. కరోనా లాక్ డౌన్ టైంలో జనాలు ఇంట్లోనే ఉంది ఓటీటీల్లో కొత్త సినిమాలు చూడటం మొదలుపెట్టారు. గతేడాది వరకు.. సినిమాలు రిలీజ్ అయిన 4 వారాలకే ఓటీటీల్లో దర్శనమిచ్చేవి. అలాగే టికెట్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడం ఓ మైనస్. పెద్ద సినిమాలు వీకెండ్ వరకు పర్వాలేదనిపించేవి.. తర్వాత స్లీపేసేవి. సోమవారం నుండి కలెక్షన్లు తగ్గిపోవడానికి కారణం ఓవర్సీస్ మార్కెట్.డాలర్ రేటు ఎక్కువ కాబట్టి వీకెండ్ కు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అక్కడి జనాలు వీకెండ్ వరకు మాత్రమే పెద్ద సంఖ్యలో సినిమాలు చూస్తారు. మళ్ళీ వీకెండ్ వచ్చే వరకు థియేటర్ల వైపు జనాలు చూడరు. ఈ ఏడాది కూడా అదే జరిగింది. 2022 లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాలు ఏంటో.. మరీ ముఖ్యంగా 1 మిలియన్ కొట్టిన సినిమాలు ఏంటి అనే విషయాల పై ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి- ఎన్టీఆర్- రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఏకంగా 15 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. అక్కడ ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

2) భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 2.4 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి హిట్ మూవీగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీ యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది.

3) సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 2.3 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి అక్కడ సక్సెస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

4) రాధే శ్యామ్ :

ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 2.3 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. కానీ ఎక్కువ రేట్లకు ఈ మూవీని విక్రయించడంతో అక్కడ ప్లాప్ మూవీగా మిగిలింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

5) కార్తికేయ2 :

నిఖిల్ – చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 1.6 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది.అక్కడ ఈ మూవీ భారీ లాభాలను అందించింది.

6) సీతా రామం :

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 1.4 మిలియన్ డాలర్లను వసూల్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7) గాడ్ ఫాదర్ :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 1.28 మిలియన్ డాలర్లను వసూల్ చేసి డీసెంట్ హిట్ అనిపించుకుంది.

8) ఎఫ్3 :

వెంకటేష్ – వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 1.26 మిలియన్ డాలర్లను వసూల్ చేసి హిట్ మూవీగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

9) మేజర్ :

అడివి శేష్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 1.14 మిలియన్ డాలర్లను వసూల్ చేసి హిట్ మూవీగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

10) అంటే సుందరానికి :

నాని – నజ్రియా జంటగా నటించిన ఈ మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 1.1 మిలియన్ డాలర్లను వసూల్ చేసి అక్కడ హిట్ మూవీగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ ప్లాప్.

11) హిట్ 2 :

అడివి శేష్ హీరోగా నాని నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్లను వసూల్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. తెలుగులో కూడా ఈ మూవీ సూపర్ హిట్.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus