విశ్వాసం ఫస్ట్ లుక్ తో ఆకట్టుకోలేకపోయిన అజిత్

  • August 23, 2018 / 11:29 AM IST

తమిళలంలో ఒక్కటంటే ఒక్క ప్రత్యక్ష అభిమాన సంఘం కూడా లేకుండా, సోషల్ మీడియాలో అఫీషియల్ ఎకౌంట్స్ కానీ ఫ్యాన్ పేజస్ కానీ లేకుండా, పెయిడ్ ప్రమోషన్ జోలికి పోకుండా నిక్కచ్చిగా ఉంటూ స్టార్ హీరోగా ఎదిగిన ఏకైక నటుడు అజిత్. మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడని ఈ ఆరడుగుల అందగాడు గత మూడు సినిమాలుగా దర్శకుడ్ని మాత్రం మార్చడం లేదు. “వీరం, వేదాలమ్, వివేకం” చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ ఆ మూడు సినిమాల్లో రెండిటితో అజిత్ కు మంచి హిట్స్ ఇవ్వడమే కాకుండా అజిత్ మాస్ ఇమేజ్ ను అమాంతం పెంచేశాయి.

అయితే.. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి చిత్రం “వివేకం” మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినాసరే అజిత్ మాత్రం శివ మీద నమ్మకంతో మరో సినిమా ఆఫర్ ను ఇచ్చాడు శివకి. ఆ సినిమానే “విశ్వాసం”. ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ ఉదయం విడుదల చేశాడు దర్శకుడు శివ. ఉరమాస్ ఫోజ్ తో అజిత్ డబుల్ ఫోజ్ ఆకట్టుకొనేలాగే కనిపిస్తుంది. మరి ఈ సినిమాతో శివ మళ్ళీ “వీరం” లాంటి హిట్ ఇస్తాడో లేక “వివేకం” లాంటి ఫ్లాప్ ఇస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus