పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించి గత నెల 29వ తేదీన థియేటర్లలో విడుదలైన రొమాంటిక్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజైన నాలుగు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి రానుండటం గమనార్హం. అనీల్ పాదూరి డైరెక్షన్ లో పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఆహా ఓటీటీలో రొమాంటిక్ మూవీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
నవంబర్ 26వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి రానుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఆహా ట్విట్టర్ ఖాతా ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. థియేటర్ లో ఈ సినిమాను మిస్సై ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఆహా ఓటీటీ ద్వారా ఈ సినిమాను చూడవచ్చు. ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వస్తుండటంతో పూరీ ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. ఆకాష్ పూరీ కెరీర్ లో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవకపోయినా నటుడిగా ఆకాష్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.
అయితే తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలను అందించిందని సమాచారం. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోని రొమాంటిక్ ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు ఆహా ఓటీటీ వరుసగా కొత్త సినిమాలను అందుబాటులోకి తెస్తూ సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!