Akhanda Collections: 13వ రోజున కూడా అదే మాస్ జోరు..!

  • December 15, 2021 / 12:10 PM IST

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం విడుదలై 13 రోజులు పూర్తికావస్తోన్నప్పటికీ ఇప్పటికి మంచి కలెక్షన్లు నమోదు చేస్తూనే ఉంది. ‘పుష్ప’ ఎంట్రీ వరకు ఇదే రేంజ్లో కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ‘ద్వారకా క్రియేషన్స్‌’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2వ వీకెండ్ ను కూడా భారీగా క్యాష్ చేసుకుంది. ఇక 13వ రోజున కూడా ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉండటం విశేషం.

ఈ చిత్రం 13 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :

నైజాం 18.02 cr
సీడెడ్ 13.62 cr
ఉత్తరాంధ్ర  5.63 cr
ఈస్ట్  3.67 cr
వెస్ట్  3.06 cr
గుంటూరు  4.24 cr
కృష్ణా  3.27 cr
నెల్లూరు  2.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 53.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  9.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 63.53 cr

‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం 13 రోజులకి గాను రూ.63.53 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.9.53 కోట్ల లాభాలు దక్కాయి. నిన్న కూడా ఈ చిత్రం రూ.0.74 కోట్ల షేర్ ను రాబట్టింది. కానీ ఆంధ్రాలో ఇంకా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది ‘అఖండ’.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus