పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

టాలీవుడ్ హీరో అంటే ఎప్పుడూ సూపర్ పవర్స్ ఉన్న హీరోలానే కనపడాలి అనే థాట్ మెల్ల మెల్లగా మారిపోతుంది. ‘నేనింతే సినిమాలో హరీష్ శంకర్ చెప్పినట్టు.. హీరో ఇంట్రొడక్షన్ కి 50 మందిని లేపెయ్యాలి.. ఇంటర్వెల్ కి మరో 50 మందిని.. ఇక క్లైమాక్స్ కు అయితే 100మందిని ఒంటి చేత్తో లేపెయ్యాలి’ అన్నట్టుగా మన దర్శకులు ఆలోచించడం లేదు. హీరోయిన్లను కూడా పాటలకే పరిమితం చేసెయ్యాలి అనే ఉద్దేశంతో కాకుండా వాళ్లకి కూడా కథకి సరిపడే పాత్రలని డిజైన్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో చూసుకుంటే హీరో లేదా హీరోయిన్లు ప్రభుత్వ ఉద్యోగులుగా నటిస్తుండడం మనం గమనించవచ్చు. హీరో లేదా హీరోయిన్ ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపించి వారి అధికారంతో ప్రత్యర్దులకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పబ్లిక్ సర్వెంట్స్ అయిపోయి జనాలకి సాయం చేస్తుండడం వంటివి చూస్తుంటే… ప్రభుత్వాలను దారిలో పెట్టడానికి ఇలాంటి నిజాయితీతో కూడుకున్న అవసరమని.. జనాల్లో చైతన్యం నింపేలా ఈ పాత్రలు ఉంటున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపించిన హీరో హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రాంచరణ్ :

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో సివిల్ సర్వెంట్ పాత్రని పోషిస్తున్నాడు.

2) సాయి ధరమ్ తేజ్ :

దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ సినిమాలో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గా కనిపించి అలరించాడు మన మెగా మేనల్లుడు.

3) వైష్ణవ్ తేజ్ :

‘కొండపొలం’ చిత్రం క్లైమాక్స్ లో ఐ.ఎఫ్ఎస్ ఆఫీసర్ గా కనిపించి అలరించాడు వైష్ణవ్ తేజ్.

4) ఆనంద్ దేవరకొండ :

‘పుష్పక విమానం’ చిత్రంలో గవర్నమెంట్ టీచర్ పాత్రలో కనిపించి అలరించాడు మన విజయ్ దేవరకొండ తమ్ముడు.

5) ప్రగ్య జైస్వాల్ :

‘అఖండ’ చిత్రంలో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గా కనిపించి అదరగొట్టింది మన ‘కంచె’ భామ.

6) రీతూ వర్మ :

‘టక్ జగదీష్’ చిత్రంలో వి.ఆర్.ఓ గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో కనిపించి అలరించింది రీతూ వర్మ.

7) నితిన్ :

‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రంలో కలెక్టర్ గా కనిపించబోతున్నాడు నితిన్. ఎస్ఆర్ శేఖర్ రెడ్డి అనే యువ దర్శకుడు ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.

8) రవితేజ :

శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో గ్రూప్2 ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

9) పవన్ కళ్యాణ్ :

‘భీమ్లా నాయక్’ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రంలో కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు పవన్.

10) నాని :

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ చిత్రంలో ఎం.ఆర్.ఓ గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు నాని. ఎం.ఆర్.ఓ అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఆ పాత్ర ఉంటుంది.

11) చిరంజీవి :

బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట.’మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus