Akhil: ఆ హీరో నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. ఆమెతోనే డేట్‌.. అఖిల్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • May 2, 2023 / 06:46 PM IST

ఇంట్లో తండ్రికి తెలియకుండా గోడ దూకి బయటకు వెళ్లే పిల్లల గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు కూడా. ఇలాంటి సీన్సే స్టార్‌ హీరోల ఇళ్లలో కూడా జరుగుతాయా అంటే ఆ మధ్య రామ్‌చరణ్‌, రానా విషయం తెలిసింది. దీంతో ‘అవునా?’ అని అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు ఇది చాలామంది స్టార్‌ హీరోల ఇళ్లల్లో జరుగుతుంది అని మరోసారి తేలింది. అయితే ఈసారి ఆ పని చేశాను అని చెప్పింది అఖిల్‌. అవును నాగార్జున ఇంట్లోనే జరిగిందట.. కానీ ఆయనకు తెలియదు.

అఖిల్‌ తన ‘ఏజెంట్’ సినిమా ప్రచారం కోసం సుమ షోకి వచ్చాడు. తన హీరోయిన్‌ సాక్షి వైద్యతో వచ్చిన అఖిల్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నాగార్జునకు తెలియకుండా చేసిన పని ఏదైనా ఉందా అంటే.. గోడ దూకి రాత్రిళ్లు బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాణ్ని అని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్‌ ‘అయ్యగారు మన టైపే’ అంటూ హ్యాపీ అవుతున్నారు. మరోవైపు డేట్‌కి వెళ్లే అవకాశం వస్తే ఎవరితో వెళ్తారు అని అడిగితే బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు చెప్పాడు అఖిల్‌.

ఇక ఇండస్ట్రీలో బాగా నచ్చే హీరో ఎవరు అని అడిగితే.. ‘రామ్‌చరణ్‌ అంటే నాకు బాగా ఇష్టం. అతను నా హార్ట్‌ బీట్‌’ అని చెప్పాడు. దీంతో ఇప్పుడు అతని కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలోనూ ఇద్దరి మధ్య అనుబంధం గురించి కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. కొన్ని సినిమాల షూటింగ్‌ సమయంలో ఒకరి సెట్స్‌కి మరొకరు వెళ్లేవారు. అలాగే మొన్నీమధ్యే ‘ఏజెంట్‌’ సినిమా కోసం ప్రమోషన్స్‌ అఖిల్‌కు చరణ్‌ హెల్ప్‌ చేశాడు.

అలాగే ఇదే షోలో ‘శివ’ సినిమాలో సైకిల్‌ చైన్‌ లాగే సీన్‌ను కూడా చేసి చూపించాడు (Akhil) అఖిల్‌. అయితే అది కాస్త కామెడీ వేలో చేసి చూపించాడు అఖిల్‌. అదే సీన్‌ ఫుల్‌ అగ్రెషన్‌లో సినిమాలో పడితే చూడాలని ఫ్యాన్స్‌ చాలా రోజుల నుండి ఆశిస్తున్నారు. ఆ సీన్‌ మరెప్పుడో చూడాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus