అక్కినేని వారసుడిగా కాకుండా అఖిల్ గానే ఉంటా!

Advertisement

అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా ద్వారా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఎన్నో అంచనాల నడుమ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అఖిల్ ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ వారసత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమ తల్లి తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటు ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ సైతం వారసత్వం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగడం కంటే అఖిల్ గా ఇండస్ట్రీలో కొనసాగడమే ఇష్టమని తెలియజేశారు. ప్రేక్షకులు కూడా నన్ను అక్కినేని వారసుడిగా కాకుండా అఖిల్ గానే ఓన్ చేసుకుంటే చాలా సంతోషమని తెలిపారు.

అక్కినేని వారసత్వం గురించి ఆలోచిస్తే తాను అదే మూస ధోరణిలో ఉండిపోతానని తెలియజేశారు. ప్రస్తుతం తాను సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని,ఈ జర్నీలో సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన చివరి వరకు నేను నాలాగే ఉండడం కోసం ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్.

తనకు తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అవసరం లేకుండా తనకు తాను గుర్తింపు తెచ్చుకోవడం ప్రయత్నిస్తాను అంటూ ఈ సందర్భంగా వారసత్వం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా విషయానికి వస్తే ఈ సినిమాపై అఖిల్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ పోస్టర్స్ భారీ అంచనాలను పెంచేసాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus