Agent Twitter Review: ‘ఏజెంట్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..!

Advertisement

అక్కినేని అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కంప్లీట్ యాక్షన్ మూవీ ‘ఏజెంట్’. ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘సురేందర్ 2 సినిమా’ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని అఖిల్ కెరీర్లోనే భారీగా రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్, టీజర్, ట్రైలర్ లు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను నమోదు చేశాయి. హిపాప్ తమిళ సంగీతంలో రూపొందిన పాటల్లో ‘వైల్డ్ సాలా’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఏప్రిల్ 28న అంటే మరికొన్ని గంటల్లో (Agent) ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్, మమ్ముట్టి ఈ చిత్రానికి హైలెట్స్ అని. అఖిల్ కూడా బాగా కష్టపడ్డాడని.. అయితే ఎక్కువ ప్రాధాన్యత మమ్ముట్టి పాత్రకు ఇచ్చినట్టు అంతా చెబుతున్నారు.

నటనలో అఖిల్ ఇంప్రూవ్ అయ్యాడట. కానీ సురేందర్ రెడ్డి ఇతనితో ఓ మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తీస్తే బాగుండేదని… ‘ఏజెంట్’ అనే యాక్షన్ కథ అఖిల్ మోయలేని బరువు అని… అంతా అంటున్నారు. అయినా అఖిల్ బాగానే హ్యాండిల్ చేశాడట.

తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.అలాగే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత వరకు లాక్కొస్తుంది అనేది తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాలి.

 

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus