బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అక్షయ్ సినిమాలు చేశారు. తాజాగా అక్షయ్ తన ప్రేమ సంగతులను అభిమానులతో పంచుకున్నారు. ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి ముందు టీనేజ్ లో ఓ అమ్మాయిని ప్రేమించానని.. కానీ ఆ రిలేషన్ ఎక్కువ రోజులు సాగలేదని చెప్పుకొచ్చారు. టీనేజ్ లో ఒక అమ్మాయిని డేటింగ్ చేసినట్లు చెప్పిన అక్షయ్..
సినిమాలు, షికార్లు అంటూ బాగానే తిరిగామని చెప్పారు. జాలీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో ఆ అమ్మాయి తనను వదిలేసి వెళ్లిపోయిందని చెప్పారు. దానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చారు. కిస్ చేయడం, హగ్ చేసుకోవడం వంటివి చేయకపోవడంతో ఆ అమ్మాయి తనను వదిలేసిందని చెప్పి ఆశ్చర్యపరిచాడు అక్షయ్. మొదటినుండి తనకు సిగ్గు ఎక్కువని.. అదే సమస్యగా మారిందని అన్నారు. తానెప్పుడూ కూడా ప్రియురాలి భుజంపై చేయి వేయడం, చేతిని పట్టుకోవడం లాంటి రొమాంటిక్ పనులు చేయకపోవడం వలన అమ్మాయికి తాను నచ్చలేదని చెప్పుకొచ్చాడు.
దీంతో తనను వదిలేసి వెళ్లిపోయిందని తన బ్రేకప్ స్టోరీని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అక్షయ్ నటించిన ‘బెల్ బాటమ్’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అలానే ‘పృథ్వీ రాజ్’, ‘బచ్చన్ పాండే’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!