Ali wife Zubeda: ఆ విషయంలో అలీ భార్య గ్రేట్ అంటున్న నెటిజన్లు.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఒకరైన అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలీ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా టీవీ షోలతో మాత్రం బిజీగా ఉన్నారు. అలీ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అలీ పాపులారిటీని పెంచుకున్నారు. అలీ భార్య జుబేదా కూడా ప్రేక్షకులకు సుపరిచితం అనే సంగతి తెలిసిందే. అలీ, జుబేదా తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసే విషయంలో ముందువరసలో ఉంటారు.

నిరుపేదలకు జుబేదా బిర్యానీ ప్యాకెట్లను పంచగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జుబేదా మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జుబేదా మరెంతో మంది నిరుపేదలకు ఈ విధంగా సాయం చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్టార్ కమెడియన్ అలీ వయస్సు 56 సంవత్సరాలు కాగా అలీ రేంజ్ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. జుబేదా అలీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు.

ఎగ్ ధమ్ బిర్యానీని ఆకలితో ఉన్నవాళ్లకు పంచి (Zubeda) జుబేదా ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ యూట్యూబ్ వీడియోకు ఏకంగా 10 లక్షల వ్యూస్ రావడం గమనార్హం. స్పందించే హృదయం, సహాయం చేసే గుణం ఉన్న జుబేదా మంచి మనస్సును ఎంత పొగిడినా తక్కువేనని ఇలాంటి మంచి పనులను ప్రోత్సహిస్తున్న అలీ కూడా ఈ ప్రశంసలకు అర్హుడు అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఎంతోమందికి ఆమె స్పూర్తిగా నిలిచారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అలీ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్లు చెబుతున్నారు. అలీ పెద్ద సినిమాలతో బిజీ అయితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అలీ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus