వైరల్ : ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ ఆలియా భట్ ఫస్ట్ లుక్..!

  • March 15, 2021 / 12:15 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్- రాంచరణ్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ కం పాన్ ఇండియా మూవీలో… అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా అతనికి జోడి అయిన సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఈ చిత్రంలోని ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు ముందుగానే ప్రకటించారు.

వారు అనౌన్స్ చేసినట్టుగానే.. ఈరోజు ఆలియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి లు.. ఆమె ఫస్ట్ లుక్ కు పోస్టర్ ను విడుదల చేశారు. రామరాజు కోసం ఓ పక్క దిగులుగా మరోపక్క ఆశగా సీత అలియాస్ ఆలియా ఎదురుచూస్తున్నట్టు ఈ లుక్ స్పష్టం చేస్తోంది. పచ్చ కోక.. ఎర్ర రైకలో అలియా కనిపిస్తుండడం విశేషం. అందరినీ ఆకట్టుకునే విధంగానే ఈమె లుక్ ఉంది.ఇలా విడుదలైందో లేదో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ఈ లుక్.

ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా దర్శకుడు రాజమౌళి మొదలుపెట్టినట్టు ఇన్సైడ్ టాక్. అక్టోబర్ 13న దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. అజయ్ దేవగణ్,శ్రియ, సముద్రఖని వంటి స్టార్లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus