‘ఆర్.ఆర్.ఆర్’ టీం కు అలియా భట్ కండిషన్స్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకే..!

కేంద్ర ప్రభుత్వం సినిమాల షూటింగ్లకు పర్మిషన్లు ఇచ్చేసిన తరుణంలో చాలా వరకూ చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల షూటింగ్లు మొదలయ్యాయి. అక్టోబర్ నుండీ స్టార్ హీరోలు కూడా షూటింగ్లలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. అంతా బానే ఉంది కానీ.. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ సంగతే ఎటూ తేలడం లేదు. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్ చిత్రం. షూటింగ్ కు వేలాది మంది పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి చాలా కట్టుదిట్టమైన భద్రతలు తీసుకోవాలి.

పొరపాటున ఒక్కరు కరోనా భారిన పడినా..షూటింగ్ పై ఎఫెక్ట్ పడుతుంది.అందుకే మొదట రాజమౌళి.. ఎన్టీఆర్ పై సోలో షాట్స్ తీసి అతనికి సంబంధించిన టీజర్ ను రెడీ చేసి విడుదల చేయించాలి అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ సడెన్ గా .. హీరోయిన్ అలియా భట్ పెట్టిన కండిషన్స్ .. రాజమౌళిని కన్ఫ్యూజన్లో పడేశాయని తెలుస్తుంది. ఈ చిత్రంలో చరణ్ కు అంటే అల్లూరి సీతారామరాజు పాత్రకు జోడీగా నటించబోతుంది అలియా భట్. ఇప్పటికే ఈమె ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ కావాల్సి ఉంది. కానీ ఒకసారి హీరోలకు గాయాలు కావడంతో పూణె షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది.

 

ఆ షెడ్యూల్ లో అలియా భట్ పాల్గొనాల్సి ఉంది. అటు తరువాత ఈ ఏడాది సమ్మర్ లో కూడా అలియా షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల అది కూడా క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈమె అక్టోబర్ నుండీ ‘ఆర్.ఆర్.ఆర్’ కు డేట్స్ ఇస్తానని చెప్పిందట. అంతేకాదు వీలైనంత త్వరగా అంటే డిసెంబర్ లేదా జనవరికి ఈమె పార్ట్ ను పూర్తిచేయాలని, వీటి తరువాత హిందీ సినిమాల షూటింగ్లలో కూడా తాను పాల్గొనాలని రాజమౌళికి చెప్పిందట. అలా అయితే ఎన్టీఆర్.. ‘కొమరం భీమ్’ టీజర్ కు ఇబ్బందనే చెప్పాలి..!

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus