‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుని క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత ‘నువ్వు లేక నేను లేను’ ‘ఇంద్ర’ ‘వసంతం’ ‘నేనున్నాను’ వంటి సూపర్ హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్ గాను ఎదిగింది.తక్కువ టైంలోనే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమె నటించింది.అయితే ఏమైందో ఏమో.. సడెన్ గా ఈమె క్రేజ్ పడిపోతూ వచ్చింది.
ఆ క్రమంలో చిన్న హీరోల సినిమాల్లోనూ, కమెడియన్ ల సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. అయితే అంత త్వరగా ఈమె ఫేడౌట్ అయిపోవడం వెనుక కారణం ఏంటి అన్నది ఎవ్వరికీ తెలీదు. ఓ యువ హీరోతో ఈమె ప్రేమాయణం నడిపిందని… కానీ అతను ఈమెను మోసం చేసాడు అనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఆ తరువాత ఆ హీరో కూడా ఫేడౌట్ అయిపోయాడనుకోండి..!మరోపక్క ఆర్తి అగర్వాల్ బరువు తగ్గడం కోసం విదేశాలకు వెళ్లి అక్కడ సర్జరీ చేయించుకుంటున్న తరుణంలో.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. 31 ఏళ్లకే ఆర్తి అగర్వాల్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘ఆర్తి అగర్వాల్’ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. ఆమె జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలన ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడట ఓ క్రేజీ డైరెక్టర్. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. అయితే ఈ బయోపిక్ లో ఆర్తి అగర్వాల్ ను ప్రేమించి మోసం చేసిన ఆ యువ హీరో ప్రస్తావన ఉంటుందా..? ఉండదా? అనే డిస్కషన్లు కూడా నడుస్తున్నాయి.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?