Balakrishna: అన్ స్టాపబుల్ 3 కోసం సిద్ధమైన బాలయ్య.. మొదటి ఎపిసోడ్ వారితోనే?

  • October 6, 2023 / 09:08 PM IST

వెండితెరపై తన నటనతో అద్భుతమైనటువంటి డైలాగులతో అందరినీ మెప్పించినటువంటి బాలకృష్ణ వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈయన వ్యాఖ్యాతగా ఆహాలో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను పూర్తిచేసుకుని మూడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే ఈ సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా ఈ కార్యక్రమం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్ స్టాపబుల్ త్రీ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని బాలయ్య కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకొని దసరా పండుగ సందర్భంగా మొదటి ఎపిసోడ్ ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా విజయదశమి సందర్భంగా ఈ కార్యక్రమం ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఇక ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం ఈ సీజన్లో మెగాస్టార్ చిరంజీవి మంత్రి కేటీఆర్ వంటి తదితరులు పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. అయితే మొదటి ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి టీం ఈ కార్యక్రమంలో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus