Hero Surya: పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించిన సూర్య?

  • July 18, 2022 / 07:19 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులో ఏ విధమైనటువంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈయనకు తమిళంతో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇకపోతే ఇప్పటివరకు సూర్య పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో హీరోగా నటించలేదు ఈ క్రమంలోనే త్వరలోనే ఈయన స్ట్రైట్ తెలుగు మూవీ ఉంటుందని పెద్ద ఎత్తున గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

గతంలో సూర్య త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెలుగు సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలు గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు. ఇకపోతే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సింగం వంటి మాస్ యాక్షన్ సినిమా కావాలని ప్రేక్షకులు కోరగా అందుకు బోయపాటి కూడా ఓకే అని సమాధానం ఇచ్చారు కానీ ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇకపోతే తాజాగా మరోసారి సూర్య తెలుగు స్ట్రైట్ మూవీ గురించి పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.

ఇకపోతే శౌర్యం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు శివ దర్శకత్వంలో సూర్య పూర్తిస్థాయి తెలుగు సినిమాలో చేయబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈయన తమిళంలో అజిత్ వంటి హీరోలతో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే శివ దర్శకత్వంలో సూర్య తెలుగు సినిమా చేయబోతున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాని యువి క్రియేషన్ బ్యానర్ లో నిర్మించడం గమనార్హం.

ఇక ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం ఇతర నటీనటుల గురించి ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య బాల దశకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus