Pawan Kalyan, Sujeeth: దానయ్య నిర్మాణంలోనే పవన్- సుజీత్ ల మూవీ.. ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ రెడీ..!

Advertisement

పవన్ కళ్యాణ్ నుండి ఈ ఏడాది వచ్చిన ‘భీమ్లా నాయక్’ మూవీ మంచి టాక్ ను రాబట్టుకుంది కానీ.. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత పవన్ ఏ సినిమా షూటింగ్లలోనూ నిలకడగా పాల్గొనడం లేదు. సముద్ర ఖని, హరీష్ శంకర్ ల దర్శకత్వంలో సినిమాలు స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్టుల ఊసే లేదు. మరోపక్క ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్లో తనకు మూడొచ్చినపుడు పాల్గొంటున్నాడు.

ఆ చిత్రం దర్శకుడైన క్రిష్ కానీ, నిర్మాతలు కానీ ఏమీ అనలేక.. పవన్ కాల్ షీట్లను.. దొరికినవే మహా ప్రసాదంగా భావిస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో చాలా బిజీగా గడుపుతున్నాడు. 2024 ఎన్నికల్లో తన పార్టీని స్ట్రాంగ్ గా నిలబెట్టాలని… భావిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నవంబర్ నుండి 2023 మార్చి వరకు పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. అంతేకాదు ఓ కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వివరాల్లోకి వెళితే.. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా కథనాలు వినిపిస్తున్నాయి. ‘రన్ రాజా రన్’ ‘ సాహో’ వంటి చిత్రాలను తెరకెక్కించిన సుజీత్ కు.. మూడో సినిమా చేయడానికి చాలా గ్యాప్ వచ్చింది.చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాని మొదట సుజీత్ తెరకెక్కించాలి కానీ.. ఎందుకో అది సుజీత్ మిస్ చేసుకున్నాడు.

తర్వాత గోపీచంద్, వరుణ్ తేజ్ లతో సినిమాలు అన్నారు. అవి కూడా సెట్ అవ్వలేదు. కానీ పవన్ తో మూవీ సెట్ అయిపోయింది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. డిసెంబర్ 4న అంటే రేపు అధికారిక ప్రకటన రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus