Allari Naresh: అల్లరి నరేష్ కు ఇష్టమైన డైరెక్టర్లు వీళ్లే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన అల్లరి నరేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు రాజమౌళి, మణిరత్నంతో చేయాలని ఉంటుందని అయితే నాకు పని చేయాలని ఉన్నంత మాత్రాన వాళ్లకు కూడా ఉండాలి కదా అని తెలిపారు. అల్లరి సినిమాకు ముందు నేను చాలామంది డైరెక్టర్లను కలిశానని అయితే ఛాన్స్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. నా లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గానే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. నేను పార్టీలకు వెళతానని ఫ్రెండ్స్ తో ఉంటానని అల్లరి నరేష్ తెలిపారు.

అందరిలానే అమ్మాయిలకు లైన్ వేస్తుంటానని అల్లరి నరేష్ కామెంట్లు చేశారు. ఒక అమ్మాయి చాలా అందంగా ఉందని ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగిందని అల్లరి నరేష్ అన్నారు. నేను యాక్టర్ కాకపోతే ఆ అమ్మాయి ఫోన్ నంబర్ అడగొచ్చు కదా అని అనుకున్నానని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు. ట్రైన్ ఎక్కే సమయంలో ఫస్ట్ నేను చార్ట్ చూసుకుంటానని నరేష్ కామెంట్లు చేశారు. ఫ్లైట్ వచ్చిన సమయంలో పక్క సీటులో అమ్మాయి వస్తుందేమో అని చూస్తానని కానీ ఎప్పుడూ అలా జరగదని నరేష్ తెలిపారు.

7వ తరగతిలోనే ఇన్ఫ్యాచుయేషన్ స్టార్ట్ అయిందని అప్పుడే నేను ముదురు అని నరేష్ కామెంట్లు చేశారు. శ్వేత అనే అమ్మాయి ఉండేదని ఆ అమ్మాయి చాలా బాగుండేదని ఆమె మలయాళీ అని నరేష్ చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి స్కూల్ లో లీడర్ అని నరేష్ కామెంట్లు చేశారు. ఆ అమ్మాయి హెయిర్ స్టైల్ బాగుండేదని ఆ అమ్మాయి టాపర్ అని నేను మాత్రం అన్ని విషయాల్లో లాస్ట్ ఉండేవాడినని నరేష్ చెప్పుకొచ్చారు.

ఒక విధంగా ఆ అమ్మాయి ఫస్ట్ క్రష్ అని నరేష్ కామెంట్లు చేశారు. అయితే నేను ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదని అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ధైర్యం సరిపోదని నరేష్ అన్నారు. ప్రపోజ్ చేయాలని ఉంటుందని కానీ ఆ అమ్మాయి నో చెబితే ఎలా అని అనిపిస్తుందని అల్లరి నరేష్ కామెంట్లు చేశారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus