Allari Naresh: మరోసారి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసిన అల్లరి నరేష్..!

  • April 26, 2023 / 12:41 PM IST

దివంగత స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గారి రెండో అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్. ‘అల్లరి’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ బాగా చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు నరేష్. అటు తర్వాత వరుసగా పలు కామెడీ సినిమాల్లో నటించినా ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ వంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేస్తూనే వచ్చాడు.

అయినా కామెడీ సినిమాలే ఇతన్ని స్టార్ గా చేసాయి అన్నది వాస్తవం. అయితే జబర్దస్త్ వంటి కామెడీ షోలు పెరిగిపోవడం, అల్లరి నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ కూడా మరణించడంతో నరేష్ రేసులో వెనుక పడ్డాడు. ఇతని హిట్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఇతని సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్లిపోతున్నాయి తెలీని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి టైంలో అల్లరి నరేష్ రూటు మార్చి సీరియస్ రోల్స్ చేయడానికి డిసైడ్ అయ్యాడు.

అలా ‘మహర్షి’ సినిమాలో రవి పాత్రని పోషించాడు. ఆ సినిమాలో అల్లరి నరేష్ (Allari Naresh) పాత్ర బాగా హైలెట్ అయ్యింది. సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. అదే టైంలో ‘నాంది’ సినిమా మొదలుపెట్టాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. నరేష్ కు మంచి కంబ్యాక్ ను అందించింది. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా నిరాశపరిచినప్పటికీ.. నరేష్ హానెస్ట్ పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులే పడ్డాయి.

త్వరలో ‘ఉగ్రం’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీనిని కూడా నాంది దర్శకుడు విజయ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కంప్లీట్ అయ్యాక నాగార్జునతో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈలోగానే మరో సినిమాకి కూడా సైన్ చేశాడట నరేష్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి కమర్షియల్ హిట్ ను అందుకున్న సుబ్బు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సైన్ చేశాడట. అందులో నరేష్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించబోతున్నాడట.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus