అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల రొమాంటిక్ ఫోటోలు వైరల్..!

సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నప్పటికీ.. తన ఫ్యామిలీ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.తన భార్యను అలాగే పిల్లలను తీసుకుని విదేశాలకు వెకేషన్లకు వెళ్లి వస్తుంటాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల తన భార్య స్నేహారెడ్డి పై ముద్దుల వర్షం కురిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మార్చి 6న అల్లు అర్జున్- స్నేహా రెడ్డి ల 10వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా… ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ వద్దకు వెళ్లి ఆ వేడుకని జరుపుకున్నారు.

పెళ్లి రోజునాడు అన్ని విషయాలను పక్కన పెట్టేసి ఎంజాయ్ చేశారు. వైట్ అండ్ వైట్ దుస్తులను ధరించి.. తాజ్ మహల్ ముందు ఎంతో రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులిచ్చారు ఈ జంట. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి.. ‘నువ్వు పక్కనుంటే డల్ మూమెంట్ అనేదే కనిపించదు. నువ్వు ఉహించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా’ అంటూ ఓ ఎమోషనల్ కామెంట్ కూడా పెట్టింది. దీనిని బట్టి తన భర్త పై గల ప్రేమను మనం అర్థంచేసుకోవచ్చు.

ఇక బన్నీ తన కూతురికి సంబంధించిన ఫన్నీ వీడియోలను కూడా తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. వీటికి లక్షల్లో లైకుల వర్షం కురుస్తుంటుంది. ఇది పక్కన పెడితే.. బన్నీ సినిమాల విషయాలకు వస్తే.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ చిత్రం చేస్తున్న బన్నీ.. అది పూర్తయిన తరువాత కొరటాల శివ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా చిత్రం కూడా చెయ్యబోతున్నాడు.

1

2

3

4

5

6

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15


Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus