స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా విషయాలను మాత్రమే కాదు.. కుటుంబ సంగతులను కూడా షేర్ చేస్తుంటారు. కొడుకు, కూతురు ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. పలు సంఘటనలపై కూడా స్పందిస్తుంటారు. కానీ తొలిసారిగా తన భార్య స్నేహ రెడ్డి గురించి కామెంట్ చేశారు. అది కూడా అందంపై మాట్లాడడంతో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏమన్నారంటే… “ఓ మై గాడ్! నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇంత అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నానా”అంటూ బన్నీ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశారు. తన భార్యను ప్రముఖ స్టైలిస్ట్ హర్మన్ కౌర్ చాలా అందంగా ముస్తాబు చేశారని అల్లు అర్జున్ అభినందించారు. అల్లు అర్జున్ మాత్రమే కాదు అభిమానులు కూడా గోదుమ రంగులో ఉన్న సల్వార్ కమీజ్ వేసుకొని ఉన్న స్నేహాని చూసి చాలా బాగున్నారంటూ కితాబు ఇస్తున్నారు.
అంతేకాదు తమ హీరో అందంలో స్నేహకి ఏ మాత్రం తక్కువకాదని అభిమానాన్ని చాటుకుంటున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పోస్ట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే… “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” తర్వాత అల్లు అర్జున్.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లలో అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతమందించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మూవీ గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.