శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీకి బ్రాండ్ అంబాసిడర్. కొన్నాళ్ల పాటు అతని హవా నడిచింది. అతను ఏ సినిమా చేసినా చెల్లింది. ఒకానొక దశలో రాజేంద్రప్రసాద్‌ను మించిపోతాడేమో అని అంతా భావించారు. కానీ కట్ చేస్తే.. అల్లరి నరేష్‌కు వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. అతని డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.

ఆయన తండ్రి ఈవీవీ గారు చనిపోవడం వల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో తెలియదు కానీ, అల్లరి నరేష్ తన మార్కెట్ కూడా కోల్పోయాడు. తర్వాత ‘నాంది’ తప్ప ఒక్క హిట్ కూడా అందుకోలేదు. ప్రేమకథలు, కామెడీ సినిమాలపై ఆధారపడే వారికి లాంగ్ రన్ ఉండదు అని అల్లరి నరేష్ ప్రూవ్ చేసినట్టు అయ్యింది.

సరిగ్గా ఇప్పుడు శ్రీవిష్ణు విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అల్లరి నరేష్ ఏ ప్లేస్‌లో ఉండేవాడో, ఇప్పుడు శ్రీవిష్ణు కూడా అదే ప్లేస్‌లో ఉన్నాడు. అదైతే వాస్తవమే. శ్రీవిష్ణు సినిమా అంటే ఇప్పుడు మినిమం గ్యారెంటీ అని అంతా నమ్ముతున్నారు.

శ్రీవిష్ణు సినిమాల్లో ఉండే కామెడీ కూడా ఆడియన్స్‌కి స్ట్రెస్ బస్టర్ అవుతోంది. కానీ బలవంతంగా పెట్టే స్పూఫ్‌లు, ముఖ్యంగా వేరే సినిమాలపై వేసే సెటైర్లు శ్రీవిష్ణు ట్రోల్ అయ్యేలా చేస్తున్నాయి. ఆ సెటైర్లను ఆడియన్స్ ఎంజాయ్ చేసే వరకు శ్రీవిష్ణు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ఆడియన్స్‌కి బోర్ కొట్టేసి, థియేటర్లకు రావడం లైట్ తీసుకుంటే.. శ్రీవిష్ణు కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. ఈ విషయంపై శ్రీవిష్ణు కూడా బాగా ఆలోచించి కథల విషయంలో జాగ్రత్తలు వహిస్తే బాగుంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus