Allu Arjun,Allu Arha: గణేష్ నిమజ్జనంలో కూతురితో కలిసి సందడి చేసిన బన్నీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Advertisement

అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు చాలా పెరిగింది. మనకి తెలిసిన స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ ట్యాగ్ లను మించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అతను ఎంత ఎదిగినా మన సంస్కృతిని మర్చిపోని తత్వం అతనిది.ప్రతి ఏడాది అల్లు అర్జున్ తన ఆఫీస్ లో వినాయకుని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తుంటారు. గణేష్ చతుర్థి పండుగను తన సిబ్బందితో ఘనంగా జరుపుకుంటాడు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా గణేశుని ప్రతిమను ప్రతిష్టించారు.

అంతేకాదు తన టీంతో కలిసి గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నట్లు ఇటీవల ఓ వీడియో వైరల్ అయ్యింది.’పాన్ ఇండియా స్టార్ గా ఎనలేని గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్, భారతీయ సంస్కృతిని ఎంత మాత్రం మర్చిపోలేదు’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. నిమజ్జన వేడుకలు నిమిత్తం రోడ్డుపైకి రావడానికి కూడా బన్నీ వెనుకాడలేదు. తన కూతురిని పక్కన పెట్టుకుని స్వామికి వీడ్కోలు పలుకుతూ కొబ్బరికాయ కొట్టాడు అల్లు అర్జున్.

అలానే తన కూతురు అర్హ తో ‘ఊరేగింపులో భాగమవ్వాలని, నిమజ్జనాన్ని దగ్గరగా చూడమని మరియు పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని’ ప్రోత్సహించాడు.అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ‘పుష్ప’ మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే స్క్రిప్ట్ ను రెడీ చేశాడు దర్శకుడు సుకుమార్. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ‘పుష్ప 2’ ప్రారంభమైంది.

1

2

3

4

5

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus