పాపం బన్నీని మళ్ళీ ఆడేసుకొంటున్నారు

కొందరు ఏదైనా వెధవ పనిచేస్తే బ్యాడ్ అవుతుంటారు. కానీ.. బన్నీ మాత్రం ఎలాంటి పని చేయకపోయినా బ్యాడ్ అయిపోతుంటాడు. ఆల్రెడీ ‘చెప్పను బ్రదర్’ అంటూ మెగా ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోవడానికి ముఖ్యకారణంగా మారిన బన్నీని ఆల్మోస్ట్ అందరూ తక్కువ చేసి చూడడం మొదలెట్టారు. పాపం నిన్న పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన “నాపేరు సూర్య” డైలాగ్ ఇంపాక్ట్ చూడ్డానికి బాగానే ఉన్నా, అందులో బన్నీ చెప్పిన “సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా.. ఒక్కటే ఇండియా” అంటూ చెప్పిన డైలాగ్ వినడానికి బాగానే ఉంది. అల్లు అర్జున్ తన ట్విట్టర్ ప్రొఫైల్ లో మాత్రం “సౌత్ ఇండియన్ యాక్షర్” అంటూ తన బయోను ఉంచడం కామెడీ అయిపోయింది.

సినిమాల్లో డైలాగులు చెప్పడం కాదు.. ముందు నీ బయోలో ఇండియన్ యాక్టర్ అని పెట్టుకో అంటూ చాలామంది చెప్పారు మనోడికి. దాంతో డైలాగ్ ఇంపాక్ట్ కి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను ఎంజాయ్ చేయాలో.. లేక కొందరు ఆ డైలాగ్ ను బేసుకొని చేస్తున్న కామెంట్స్ కి బాధపడాలో అర్ధం కాక కన్ఫ్యూజన్ లో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్ & పి.ఆర్ టీం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus