‘తగ్గేదేలే..’ అంటూ గతేడాది ఆఖరి నుండి ఎక్కడపడితే అక్కడ సందడి చేస్తున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’రాజ్ గా ఆయన ఆ డైలాగ్ చెప్పినప్పుడల్లా ఓ వైబ్ జనరేట్ అవుతోంది. తాజాగా అలాంటి వైబ్ న్యూయార్క్ నగరంలో కనిపించింది. అక్కడ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం లభించింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఇండియా డే పరేడ్‌కు బన్నీ సారథ్యాన్ని వహించాడు. న్యూయార్క్‌లో జరిగిన ఈ ర్యాలీ ‘తగ్గేదేలే’ అంటూ బన్నీ సందడి చేశారు.
గ్రాండ్ మార్షల్ హోదాలో ఈ పరేడ్‌లో అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో కలసి పాల్గొన్నారు. ఈ వేడుకకు సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యారని చెబుతున్నారు. ఇండియా పరేడ్‌కు ఇంతమంది హాజరవ్వడంతో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, మన్‌హట్టన్‌లల్లో నివసిస్తున్న భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట. ఈ వేడుకలో అల్లు అర్జున్‌తో శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ తదితర సెలెబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ నాలుగో పరేడ్ కౌన్సిల్ భేటీ సందర్భంగా ఈ వేడుకకు అల్లు అర్జున్‌ను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘పుష్ప’ సినిమాలోన జూకేగా నహీ (తగ్గేదేలే) డైలాగ్ చెప్పి ఉత్సాహపరిచారు. ‘‘ఇది మన దేశం జెండా.. ఎక్కడైనా తగ్గేదేలే’ అని హిందీలో మాట్లాడాడు. కరోనా పరిస్థితుల కారణంగా గత కొన్నేళ్లుగా ఈ వేడుక నిర్వహించడం లేదు.
దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుమందు బన్నీ న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌ను కలిశారు. ఆ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక బన్నీ న్యూయార్క్ వెళ్లిన సందర్భంగా అక్కడ అతనికి వైవిధ్యంగా స్వాగతం పలికారు. ప్రతిష్ఠాత్మక టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ మీద బన్నీని స్వాగతం తెలుపుతూ భారీ ఫొటోలను ప్రదర్శించారు. ఈ క్రమంలో హరీశ్ శంకర్, బన్నీ జోకులేస్తూ నవ్వుకోవడం కూడా కొన్ని వీడియోల్లో కనిపిస్తోంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?