అల్లు అర్జున్ (Allu Arjun) – త్రివిక్రమ్ (Trivikram) ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. మూడుకు మూడూ బ్లాక్‌బస్టర్ విజయాలే. దీంతో ఈ కాంబినేషన్లో రూపొందనున్న నాలుగో సినిమా మీద అందరి దృష్టి పడింది. మరోవైపు సినిమా టీమ్ సన్నిహితులు, బన్నీ సన్నిహితులు కూడా సినిమా గురించి తెగ చెబుతున్నారు. సినిమా మీరు ఊహించిన దాని కంటే భారీగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా సినిమా కథ విషయంలో ఓ లీక్ వచ్చింది. నిజానికి ఇది లీక్ కాదు కానీ.. గతంలో వచ్చిన లీక్‌కి కాస్త ఎక్స్టెండెడ్ వెర్షన్ అని చెప్పాలి.
బన్నీ – త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చింది చాలా రోజులైంది. మధ్యలో ఎలాంటి హడావుడి లేకపోవడంతో సినిమా లేదేమో అనుకున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. త్రివిక్రమ్‌కు ఇది పాన్ ఇండియా ఎంట్రీ అని కూడా చెబుతున్నారు. రూ. వందల కోట్ల బడ్జెట్‌తో అతి భారీ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాకు చెంఘీజ్ ఖాన్ చరిత్రకు సంబంధం ఉంది అంటున్నారు.
ఆ చరిత్రంలోని ఓ కీలకమైన అంశాన్ని తీసుకుని అందులోని బన్నీ సినిమాకు మూల కథ సిద్ధం చేశారు అని టాక్. మంగోలియన్లు అందరినీ ఏకం చేసి, ఎన్నో కష్టాలకు ఓర్చి.. శత్రువుల నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొని వీరుడిగా నిలిచి ఆ తర్వాత సార్వభౌముడిగా నిలిచిన వ్యక్తి చెంఘీజ్ ఖాన్ అని చరిత్ర చెబుతోంది. అయితే.. ఆ కథలోని అంశాన్ని త్రివిక్రమ్ ఎలా కథగా మార్చారు, దాని స్క్రీన్‌ప్లేను ఎలా సిద్ధం చేశారు అనేద ఇక్కడ ఆసక్తికర అంశం.
గతంలో ‘రుద్రమదేవి’ (Rudramadevi) సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో బన్నీ అలరించాడు. కాసేపు వీరుడిగా కనిపిస్తేనే అంతటి పేరు వచ్చింది. ఇప్పుడు సినిమా మొత్తం అలా కనిపిస్తే ఇంకెంత మజా వస్తుందో చూడాలి. ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) తర్వాత బన్నీ లాంగ్ గ్యాప్ తీసుకోవడం పక్కా అంటున్నారు. అదయ్యాకనే ఈ సినిమా స్టార్ట్ చేస్తారట.