Daaku Maharaaj Teaser Review: బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) , ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) దర్శకుడు బాబీ కొల్లి  (Bobby)  దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్లో 109వ ప్రాజెక్టుగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈరోజు ఈ చిత్రం టైటిల్ అలాగే టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) అనే టైటిల్..నే ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు.

Daaku Maharaaj Teaser Review:

ఈ టీజర్ 1 :36 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు.. చీకటిని శాసించే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు..! ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది’ అంటూ దర్శకుడు బాబీ వాయిస్ ఓవర్లో ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) గా బాలయ్యని పరిచయం చేశారు. బాలయ్య లుక్ ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంది.

బాగుంది కూడా..! మొదటి రెండు గ్లింప్స్..లు చూసి ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయ్యుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ పీరియాడిక్ టచ్ ఉన్న మూవీ అని ఈ టీజర్ తో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. తమన్  (S.S.Thaman)  అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి ఇంకో హైలెట్. ఇక టీజర్ లో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతుంది అని స్పష్టం చేశారు. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus