స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తన ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తానంటూ ఓ హీరోయిన్..ని , స్టార్ హీరో కొడుకు బెదిరించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరోయిన్ తెలపడం ఆసక్తికరంగా మారింది. ఆమె మరెవరో కాదు అనన్య పాండే. ‘లైగర్’ (Liger) సినిమాతో ఆమె టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో.. ఈమె తెలుగులో ఆఫర్లు రాలేదు. బాలీవుడ్లోనే సినిమాలు చేస్తుంది. ఇటీవల వచ్చిన ‘CTRL ‘ అనే సినిమాతో అలరించిన అనన్య (Ananya Panday)..

Heroine

దాని ప్రమోషన్లో భాగంగా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పై ఊహించని కామెంట్లు చేసింది. అనన్య పాండే మాట్లాడుతూ…”ఆపిల్ ఫోటో బూత్ వచ్చిన కొత్తలో అంటే నా చిన్నప్పుడు… నేను తినేది, ఒంటరిగా ఉన్నప్పుడు చేసేది, ఇంకా చిన్న చిన్న అల్లరి పనులు వంటివి ప్రైవేట్ గా(ఎవరికీ తెలియకుండా) అందులో రికార్డ్ చూసుకునేదాన్ని. అలాగే నేను సుహానా, శనయ.. కలిసి చేసే సరదా పనులను కూడా అందులో రికార్డు చేసేవాళ్ళం.

అయితే ఇవి తెలుసుకున్న ఆర్యన్…’నేను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోలు లీక్ చేస్తాను’ అంటూ బెదిరించేవాడు. తనకి ఏం కావాలన్నా సరే అలాగే బ్లాక్ మెయిల్ చేసి మా ముగ్గురినీ కంట్రోల్లో పెట్టుకునేవాడు” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది” అనన్య పాండే. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కూతురు సుహానా ఖాన్, కొడుకు ఆర్యన్ ఖాన్.. అనన్య పాండే కలిసి పెరిగారు. సంజయ్ కపూర్ కూతురు శనయ కపూర్ కూడా వీరి స్నేహితురాలు.

‘కుబేర’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus