Allu Arjun: తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్..!

Advertisement

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2 ‘ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ‘పుష్ప 2 ‘ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీ ‘కె.జి.ఎఫ్ 2 ‘ రికార్డులను బద్దలు కొడుతోంది అని అంతా భావిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా విడుదలైన పుష్ప 2 కాన్సెప్ట్ వీడియోకి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరం చూశాం.

ఇదిలా ఉండగా… అల్లు అర్జున్ ‘ఇండియన్ ఐడల్ 2 ‘ఫినాలే ఎపిసోడ్ కు గెస్ట్ గా వచ్చాడు. ఇందులో పాట పాడిన ఓ అమ్మాయిని మెచ్చుకున్నాడు. అక్కడితో ఆగలేదు… “మీ వాయిస్ తో పాటు మీ పేరు కూడా నాకు నచ్చింది. నా మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతినే,” అంటూ తన మార్క్ నవ్వు నవ్వాడు. అక్కడితో కూడా ఆగలేదు. ‘ఈ ఎపిసోడ్ శృతి చూసినా చూడకపోయినా.. తన భర్త చూస్తే మాత్రం ఫీలవుతాడు’ అన్నట్టు కామెంట్ చేశాడు.

పెళ్ళికి ముందు (Allu Arjun) అల్లు అర్జున్ ను ప్రేమ వ్యవహారాల గురించి ప్రశ్నించగా..అందుకు అతను అలాంటివి ఏమీ లేవని చెప్పాడు. ‘పెద్దలు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను’ అన్నాడు. అయితే స్నేహ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.అల్లు అర్జున్ కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడేమో తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు శృతి అని చెప్పడం… చర్చనీయాంశం అయ్యింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news