Allu Arjun: ఫస్ట్ లవ్ సీక్రెట్ బయటపెట్టిన అల్లు అర్జున్!

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రం నిర్మాణ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా అల్లు అర్జున్ ఒకవైపు సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూనే మరోవైపు ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫినాలేకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ప్రోమోలో భాగంగా అల్లు అర్జున్ తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన స్నేహారెడ్డి కన్నా ముందుగా మరొక అమ్మాయిని ఇష్టపడినట్లు తాజాగా ఈ కార్యక్రమం సందర్భంగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ చూసే అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో శృతి అనే సింగర్ చాలా అద్భుతమైన పాటను పాడారు. ఇలా ఈమె పాట పాడిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

అల్లు అర్జున్ (Allu Arjun) మాట్లాడుతూ శృతి ఈ పేరంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్లపై స్నేహ రెడ్డి రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది. ఇక స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ఇద్దరు కూడా తమ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా కలరు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus