Allu Arjun Shirt Cost: అల్లు అర్జున్ స్టైలిష్ స్వెట్‌షర్ట్, కుర్తా కాస్ట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతంటే?

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్.. ‘పుష్ప’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని.. ఇటీవలే ‘పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్ చేశాడు.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ మీద ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ప్రస్తుతం ‘పుష్ప – ది రైజ్’ రష్యాలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలోనూ బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.. తనకి సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను తెలుసుకోవడానికి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

‘పుష్ప’కి బన్నీ అక్షరాలా 60 కోట్ల పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ లగ్జీరియస్ లైఫ్ స్టైల్ గురించి, తన దగ్గరున్న ఖరీదైన 12 వస్తువుల గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇటీవల తెలుసుకున్నాం.. ఇప్పుడు బన్నీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. సుక్కు.. తనను ‘ఐకాన్ స్టార్’ గా మార్చే ముందు వరకు.. అల్లు అర్జున్ ‘స్టైలిష్ స్టార్’.. పేరుకి తగ్గట్టే తన స్టైలింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. తన స్టైల్‌కి యూత్, ఫ్యాన్స్‌లో సాలిడ్ ఫాలోయింగ్ ఉంటుంది..

హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, గాగుల్స్, క్యాప్స్ అండ్ షూస్.. ఇలా అన్నీ ఫాలో అవుతారు.. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా తన సింప్లిసిటీ, స్టైల్‌తో ఆకట్టుకుంటూ ఉంటాడు.. ‘వేదం’ లో కేబుల్ రాజుగా టీషర్ట్ బేరమాడే సీన్ అయితే ఇప్పటికీ ఆకట్టుకుంటుంది.. విషయానికొస్తే.. స్టైలిష్ స్టార్ వేసుకున్న స్వెటర్, స్వెట్‌షర్ట్, కుర్తాకి సంబంధించిన కాస్ట్ వివరాలు ఇప్పుడు చూద్దాం..

1. కునాల్ రావల్ – వాషౌట్ కాశ్మీరీ కుర్తా.. (KUNAL RAWAL – Washout Kashmiri Kurta) – రూ. 39,000..

2. ఆఫ్ – వైట్ స్లిప్ట్ హాఫ్‌టోన్ యారోస్ ఓవర్‌సైజ్డ్ క్రూ.. (Off-white Split Halftone Arrows Oversized Screw Sweatshirt) – రూ. 48,714..

3. ఫెండీ బ్లాక్ వూల్ స్వెటర్.. (FENDI Block Wool Sweater) – రూ. 76,950..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus