మైండ్ బ్లోయింగ్ లుక్.. బీడీ కాలుస్తున్న బన్నీ

  • February 10, 2021 / 09:45 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంచుకునే కథలు పాత్రలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆర్య, ఆర్య 2 సినిమాల్లో బన్నీ కనిపించిన విధానం ఆడియేన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ రెండు సినిమాల అనంతరం దాదాపు పదేళ్ల తరువాత సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న పుష్ప సినిమా పాత్ర కూడా అంతకంటే డిఫరెంట్ గా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను ఎక్కువగా విడుదల చేయలేదు. మొదట టైటిల్ పోస్టర్ అలాగే ఇటీవల రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు. మధ్య మధ్యలో లొకేషన్స్ పిక్స్ కూడా వదిలారు. అయితే పుష్ప రాజ్ పాత్రలో బన్నీ బీడీ కలుస్తున్న ఫొటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా ఎందుకు రిలీజ్ చేశారని ఓ వర్గం అభిమానులు షాక్ అయ్యారు.

కానీ నిజానికి అది ఒరిజినల్ పోస్టర్ కాదు. ఫ్యాన్ మేడ్ పోస్టర్. ఈ రోజుల్లో అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఏ రేంజ్ లో క్రియేట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కాస్త హింట్ ఇస్తే చాలు దర్శకుడి కళను ముందే ఊహించేస్తున్నారు. ఇక బీడి కలుస్తున్న ఆ పోస్టర్ ఒరిజినల్ ది కాదని అల్లు ఆర్మీ వెంటనే క్లారిటీ ఇచ్చేసింది. ఇక పుష్ప సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయాలని చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus