ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

20 ఏళ్ళు వచ్చాయంటే అమ్మాయి అయినా సరే… అబ్బాయి అయినా సరే.. పెళ్లి గురించి ఆలోచించాలనేది పాత మాట. అప్పట్లో అయితే ఆ ఏజ్ కి పెళ్లి వయసు వచ్చేసిందని.. లేటయితే ముదురు బెండకాయ అంటారని కంగారు పడేవాళ్ళు. అయితే ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఇప్పుడు 30 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా.. చాలా ఎర్లీగా పెళ్లి చేసుకున్నట్టే లెక్క. చదువు,ఉద్యోగాల పేర్లు చెప్పి అప్పటి వరకూ చాలా మంది లాగించేస్తున్నారనుకోండి.కొన్నాళ్ళు పొతే మన హర్ష వర్ధన్ చెప్పినట్టు పెళ్లి అనే మాటని చాలా మంది దూరం పెడతారేమో. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా అంతేలా ఉంది..! సరే ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పటివరకూ సినిమా సెలబ్రిటీలు మాత్రమే పెళ్లి విషయంలో కాస్త ఆలస్యం చేసేవారు.

ఇప్పుడు టీవీ వాళ్ళు కూడా అంతే..! అదే బుల్లితెర స్టార్ల గురించి చెబుతున్నాను. 30ఏళ్ళ వయసు దాటినా ఇంకా వాళ్ళు హాయిగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళెవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ర‌ష్మి గౌత‌మ్ :

ఈమె వయసు 30 ఏళ్ళు దాటిందని 5 ఏళ్ళ నుండీ చెబుతున్నారు కానీ.. ఈమె కరెక్ట్ వయసెంతో ఎవ్వరికీ తెలీదు. గూగుల్ లెక్కల ప్రకారం అయితే ఈమె వయసు 32 ఏళ్ళు..! అయినప్పటికీ ఈమె పెళ్లి గురించి ఆలోచించకుండా టీవీ షోలు చేసుకుంటూ హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

2) రోహిణి :

‘బిగ్ బాస్3’ లో ఎంట్రీ ఇచ్చి తన యాక్టివ్ నెస్ తో బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ సీరియల్ యాక్టర్. ఈమె వయసు 30ఏళ్ళు.. అయినా ఇంకా పెళ్లి గురించి ఆలోచించేదే లేదంటుంది.పలు సినిమా అవకాశాలు కూడా అందుకుంటుంది ఈ అమ్మడు.

3) విష్ణు ప్రియా :

33 ఏళ్ళ వయసు వచ్చినా… ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. వరుస టీవీ షోలు,సినిమాలు చేసుకుంటూ బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

4) హైపర్ ఆది :

ఈ ఎనర్జిటిక్ కమెడియన్ వయసు 31ఏళ్ళు. వరుస సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

5) సుడిగాలి సుధీర్ :

బుల్లితెర బిజీ ఆర్టిస్ట్ లలో సుధీర్ ముందు వరుసలో ఉంటాడు. 33 ఏళ్ళ వయసు వచ్చినా ఇతను ఇంకా పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

6) ప్రదీప్ :

ఈ స్టార్ యాంకర్ వయసు 34 ఏళ్ళు. ఇప్పుడు హీరోగా కూడా మారాడు. 24*7 బిజీగా ఉండే ఈ స్టార్ యాంకర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

7) రాహుల్ సిప్లిగంజ్ :

‘బిగ్ బాస్3’ విన్నర్.. ర్యాపర్,సింగర్ అయిన రాహుల్ వయసు 31 ఏళ్ళు. ఇంకా పెళ్లికి దూరంగా ఉంటూ.. మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూ.. సినిమాల్లో పాటలు పాడుకుంటూ హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

8) మోనాల్ గజ్జర్ :

30 ఏళ్లకు దగ్గరపడిన మోనాల్ గజ్జర్ ఇంకా పెళ్లి చేసుకోను అంటుంది. ప్రస్తుతం ఈమె వరుసగా టీవీ షోలు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.

9) భాను శ్రీ రెడ్డి:

‘బిగ్ బాస్2’ ద్వారా పాపులర్ అయిన భాను శ్రీ కూడా 30 ఏళ్ళ వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పలు టీవీ షోలు చేస్తూ బిజీగా గడుపుతుంది ఈ బ్యూటీ.

10) రవి కృష్ణ :

సీరియల్ యాక్టర్ మరియు ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ అయిన రవికృష్ణ కూడా 30ఏళ్ళ వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. వరుస సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు ఈ యాంకర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus